చేతబడి ప్రభుత్వాన్ని రక్షిస్తుందా?: కుమార స్వామి

  బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, మంత్రి రెవణ్ణ నిమ్మకాయతో శాసన సభలో అడుగ్గు పెట్టారు. విశ్వాస పరీక్షపై శాసన సభలో శుక్రవారం చర్చ జరిగింది. దీంతో బిజెపి సభ్యులు రెవణ్ణ చేతబడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో సిఎం కుమార స్వామి మాట్లాడారు. బిజెపి నేతలు హిందూ సంప్రదాయాలు బాగా నమ్ముతారని, రెవణ్ణ ఒక నిమ్మకాయ తెస్తే అనుమానిస్తారా? అని మండిపడ్డారు. రెవణ్ణను మంత్రగాడు అనడం సరికాదని, చేతబడితో ప్రభుత్వాన్ని తాము రక్షించగలమా? అని […] The post చేతబడి ప్రభుత్వాన్ని రక్షిస్తుందా?: కుమార స్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోదరుడు, మంత్రి రెవణ్ణ నిమ్మకాయతో శాసన సభలో అడుగ్గు పెట్టారు. విశ్వాస పరీక్షపై శాసన సభలో శుక్రవారం చర్చ జరిగింది. దీంతో బిజెపి సభ్యులు రెవణ్ణ చేతబడి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీంతో సిఎం కుమార స్వామి మాట్లాడారు. బిజెపి నేతలు హిందూ సంప్రదాయాలు బాగా నమ్ముతారని, రెవణ్ణ ఒక నిమ్మకాయ తెస్తే అనుమానిస్తారా? అని మండిపడ్డారు. రెవణ్ణను మంత్రగాడు అనడం సరికాదని, చేతబడితో ప్రభుత్వాన్ని తాము రక్షించగలమా? అని ప్రశ్నించారు. రెవణ్ణ ఎక్కడికి వెళ్లినా నిమ్మకాయ చేతపట్టుకొని వెళ్లుతాడని కుమారస్వామి తెలిపారు. బిజెపి అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాలకు కూడా నిధులు మంజూరు చేశామని, కేవలం రెండు మూడు జిల్లాలకే ముఖ్యమంత్రి అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎల రాజీనామాల అంశంపై చర్చించిన తరువాత బలపరీక్షపై ఓటింగ్ జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయొద్దని బిజెపికి సిఎం సూచించారు. ఇంకా 20 మంది మాట్లాడాల్సి ఉందని, గురువారం ఓటింగ్ జరగడం కష్టమేనని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య తెలిపారు.

 

black Magic -Lemons could save the Congress-JD(S) Govt

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చేతబడి ప్రభుత్వాన్ని రక్షిస్తుందా?: కుమార స్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: