వస్త్రంలో శవంతో కాలినడకన సొంతూరుకు

కలహండి(ఒడిశా): శవాన్ని తీసుకెళ్లేందుకు వ్యాను ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరాకరించడంతో గిరిజనులు తమ బంధువు శవాన్ని వస్త్రంలో కట్టి మోసుకెళ్లిన సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. కలహండి జిల్లాలోని గునుపూర్ గ్రామంలోని ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిగిడి మాఝి అనే వ్యక్తి అనారోగ్యంతో గత సోమవారం ఆసుపత్రిలో మరణించాడు. మృతదేహాన్ని తమ గ్రామానికి తరలించేందుకు అతని బంధువులు ఆసుపత్రికి చెందిన వాహనాన్ని కోరగా వైద్యులు అందుకు నిరాకరించారు. దీంతో వేరే మార్గాంతరం లేక […] The post వస్త్రంలో శవంతో కాలినడకన సొంతూరుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


కలహండి(ఒడిశా): శవాన్ని తీసుకెళ్లేందుకు వ్యాను ఇవ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిరాకరించడంతో గిరిజనులు తమ బంధువు శవాన్ని వస్త్రంలో కట్టి మోసుకెళ్లిన సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది. కలహండి జిల్లాలోని గునుపూర్ గ్రామంలోని ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిగిడి మాఝి అనే వ్యక్తి అనారోగ్యంతో గత సోమవారం ఆసుపత్రిలో మరణించాడు. మృతదేహాన్ని తమ గ్రామానికి తరలించేందుకు అతని బంధువులు ఆసుపత్రికి చెందిన వాహనాన్ని కోరగా వైద్యులు అందుకు నిరాకరించారు. దీంతో వేరే మార్గాంతరం లేక ఆ గిరిజనులు మాఝి శవాన్ని గుడ్డలో కట్టి దాన్ని భుజాన మోసుకుంటూ తమ గ్రామానికి పయనమయ్యారు. ఈ దృశ్యాన్ని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక సంబంధిత ఆస్పత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండు చేస్తున్నారు. ఆస్పత్రులలో మరణించిన వారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ఉచితంగా తరలించడానికి మహాప్రాయ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ అది ఏ రకంగా అమలవుతోందో ఈ సంఘటనే అద్దం పడుతోంది.

Tribals Carry Body of Family Member on a Sling

 

Tribals carry body of family member on a sling, Hospital denies transportation of a dead body in Odisha

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వస్త్రంలో శవంతో కాలినడకన సొంతూరుకు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.