నా సీటు వాళ్లు తీసుకోవచ్చు: కుమార స్వామి

  బెంగళూరు: కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తానేప్పుడూ అధికారం కోసం కాంగ్రెస్ వద్దకు వెళ్లలేదని, వారే తన దగ్గరుకు వచ్చారని ముఖ్యమంత్రి కుమార స్వామి తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినాయకత్వం కోరడం వల్లే తాను సిఎంగా బాధ్యతలు చేపట్టానని వివరించాడు. ప్రతి సంకీర్ణంలోనూ విభేదాలు సహజంగా ఉంటాయని, కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బిజెపి లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందన్నారు. […] The post నా సీటు వాళ్లు తీసుకోవచ్చు: కుమార స్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీలో హైడ్రామా కొనసాగుతోంది. తానేప్పుడూ అధికారం కోసం కాంగ్రెస్ వద్దకు వెళ్లలేదని, వారే తన దగ్గరుకు వచ్చారని ముఖ్యమంత్రి కుమార స్వామి తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధినాయకత్వం కోరడం వల్లే తాను సిఎంగా బాధ్యతలు చేపట్టానని వివరించాడు. ప్రతి సంకీర్ణంలోనూ విభేదాలు సహజంగా ఉంటాయని, కానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బిజెపి లక్ష్యంగా చేసుకొని కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి కుట్రలు పన్నిందన్నారు. జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణం ప్రభుత్వం అస్థిరంగా ఉందని అవహేళనలు చేసిందని, ఎంఎల్‌ఎల రాజీనామా వంటి ముఖ్యమైన వ్యవహారాన్ని వదిలేసి అధికారంలోకి రావడానికి బిజెపి కుట్రలు పన్నుతోందని కుమారస్వామి మండిపడ్డారు. కావాలంటే బిజెపి వాళ్లు తన సిఎం సీటు తీసుకోవచ్చని, ప్రభుత్వాన్ని కూడా బిజెపి ఏర్పాటు చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. జెడిఎస్-కాంగ్రెస్ కు చెందిన 16 మంది ఎంఎల్ఎలు రాజీనామాలు చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. దీంతో కుమారస్వామి అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనున్నాడు. 

 

CM Kumara swamy Comments on BJP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నా సీటు వాళ్లు తీసుకోవచ్చు: కుమార స్వామి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: