ప్రియాంక గాంధీ అరెస్టు

మీర్జాపూర్: భూ వివాదం కారణంగా సోంభద్రలో ఇటీవల జరిగిన కాల్పులలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మీర్జాపూర్ వద్ద అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సోంభద్రకు వెళ్లేందుకు ప్రియాంక, ఆమె మద్దతుదారులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ప్రియాంక రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తాము ఎవరికీ భయపడేది లేదని, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తాము శాంతియుతంగా […] The post ప్రియాంక గాంధీ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మీర్జాపూర్: భూ వివాదం కారణంగా సోంభద్రలో ఇటీవల జరిగిన కాల్పులలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మీర్జాపూర్ వద్ద అరెస్టు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సోంభద్రకు వెళ్లేందుకు ప్రియాంక, ఆమె మద్దతుదారులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన ప్రియాంక రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తాము ఎవరికీ భయపడేది లేదని, బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు తాము శాంతియుతంగా వెళుతున్నామని ఆమె తెలిపారు. పోలీసులు తనను ఎక్కడకు తీసుకు వెళుతున్నారో తనకు తెలియడం లేదని, ఏదేమైనా తాను మాత్రం సోంభద్రకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శిస్తానని ప్రియాంక స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీని స్థానిక పాలనా యంత్రాంగం అడ్డుకుందే తప్ప అరెస్టు చేయలేదని యూపీ పోలీసు డీఐజి ఓపీ సింగ్ వివరణ ఇచ్చారు. ఈ నెల 17న ఒక భూ వివాదానికి సంబంధించి గుజ్జర్లు, గోండు కులస్తుల మధ్య జరిగిన కాల్పుల పోరులో ఒకరు మరణించగా మరో 24 మందికి పైగా గాయపడ్డారు.

Priyanka Gandhi detained at Mirjapur, Priyanka was proceeding to Sonbhadra to console the familities of the victims who died in firing

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రియాంక గాంధీ అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.