రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్: కెసిఆర్

హైదరాబాద్: ఇంటి విస్తీర్ణంపై తప్పుడు డిక్లరేషన్ ఇస్తే చెల్లించాల్సిన ఆస్తి పన్ను మీద 25 రేట్లు జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అర్బన్ లోకల్ బాడీలు మంచి పద్దతిలో ఉండాలనే ఉదేశంతోనే నూతన మున్సిపల్ చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. 75 చదరపు గజాల లోపు జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదని కెసిఆర్ సూచించారు. 75 […] The post రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఇంటి విస్తీర్ణంపై తప్పుడు డిక్లరేషన్ ఇస్తే చెల్లించాల్సిన ఆస్తి పన్ను మీద 25 రేట్లు జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. అర్బన్ లోకల్ బాడీలు మంచి పద్దతిలో ఉండాలనే ఉదేశంతోనే నూతన మున్సిపల్ చట్టం తీసుకొస్తున్నామని వివరించారు. 75 చదరపు గజాల లోపు జీ ప్లస్ వన్ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదని కెసిఆర్ సూచించారు. 75 గజాల లోపు కట్టుకున్న ఇంటికి ఆస్తిపన్ను కేవలం రూ.100 మాత్రమేనని, 75 గజాల స్థలం ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక రూపాయినే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు. తెలంగాణలో అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. హరితహారం కోసం నాలుగు వేల నర్సరీలను ఏర్పాటు చేశామని, పోడు భూముల సమస్యకు భరత వాక్యం పలుకుతామని, స్వయంగా తానే వెళ్లి ప్రజాదర్బారు పెట్టి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పేద గిరిజనులకు కూడా రైతు బంధు, రైతుబీమా వర్తించాలన్నారు.

గ్రామాల్లో 85 శాతం పచ్చదనం పెరిగితేనే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం పర్మినెంట్ చేస్తానని. గ్రామాల్లో చెట్లు పెరగకుంటే సర్పంచ్ ఉద్యోగం కూడా పోతదని హెచ్చరించారు. పట్టణాల్లో పచ్చదనం పెంచడం కోసం గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో 75 మంది ఐఎఫ్‌ఎస్ అధికారులున్నారని, అయినా అడవి ఏమైందని ప్రశ్నించారు. ఏ వార్డులో అయినా 85 శాతం పచ్చదనం లేకుంటే కౌన్సెలర్ అయినా చైర్మన్ అయినా ఉద్యోగం పోతుందన్నారు. కెసిఆరో, మంత్రో, ఓ అధికారో పని చేయాలంటేనే నడవదని, ఊరి ప్రజలు ఆ ఊరి కోసం పని చేయాలని సూచించారు. ప్రతీ మున్సిపల్ వార్డులో ప్రజాదర్బారు లాంటిది జరుగుతుందన్నారు. తెలంగాణలో విఆర్‌ఒల అరాచకం అంతా ఇంతా కాదని, విఆర్‌ఒలు ఎవరి భూమిని ఎవరికైనా రాసిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగుల మోనోపలి పెరిగిపోయిందని, ఈ చట్టం ద్వారా ఏ ఉద్యోగిని ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చన్నారు. ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం 55 లక్షల ఇళ్లకు నీటి సరఫరా జరుగుతోందని కెసిఆర్ పేర్కొన్నారు.

 

House Registration Only One Rupee in Telangana: KCR

The post రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్: కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: