రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని…రూ.50లక్షల మోసం

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని ఘరానా మోసం చేసి కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజరాహిల్స్‌లో వీర బత్తిని నరేష్(30) అనే యువకుడు ఓ కలర్ ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. బోయిన్‌పల్లికి చెందిన మహిళ న్యాయవాదితో (73) పరిచయం ఏర్పడింది. దీంతో రాజమౌళి నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని సదరు న్యాయవాదికి చెప్పాడు. దీంతో రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర అనగానే […] The post రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని… రూ.50లక్షల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని ఘరానా మోసం చేసి కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజరాహిల్స్‌లో వీర బత్తిని నరేష్(30) అనే యువకుడు ఓ కలర్ ల్యాబ్‌లో పని చేస్తున్నాడు. బోయిన్‌పల్లికి చెందిన మహిళ న్యాయవాదితో (73) పరిచయం ఏర్పడింది. దీంతో రాజమౌళి నిర్మిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని సదరు న్యాయవాదికి చెప్పాడు. దీంతో రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర అనగానే ఆమె సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. రాజమౌళి సినిమాల్లో నటించాలంటే డబ్బులు ఇవ్వాలని ఆమెను అడిగేవాడు. నరేష్ చెప్పిన 15 ఎకౌంట్లలో 50 లక్షల రూపాయలు వరకు ఆమె డిపాజిట్ చేసింది. ఒక రోజు ఫోన్ చేసి ఎప్పుడూ షూటింగ్ తీసుకెళ్తావని అతడిని నిలదీసింది. దీంతో అతడు ఫోన్‌లో ఆమె బండబూతులు తిట్టాడు. దీంతో మోసపోయానని గ్రహించి ఆమె బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నరేష్ ఇక్కడ కొత్త ప్లాన్ అమలు చేశాడు. తన ఎకౌంట్లో అన్ని డబ్బులు వెసుకుంటే దొరికిపోతానని గ్రహించి కారు డ్రైవర్ల ఎకౌంట్లలో వేయించుకునేవాడు. ఇలా 15 మంది కారు డ్రైవర్ల ఎకౌంట్లలో డబ్బులు డిపాజిట్ చేసిన అనంతరం వాళ్ల ఎటిఎం తీసుకునే డ్రా చేసుకునేవాడు. దీంతో ఈ కేసులో ఏమీ తెలియని 15 మంది డ్రైవర్లు కూడా నిందితులుగా మారారు. దీంతో నరేష్‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

 

RS.50 Lakhs Fraud to Lawyer with Acting Rajamouli Film

The post రాజమౌళి సినిమాలో తల్లి పాత్ర ఇప్పిస్తానని… రూ.50లక్షల మోసం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.