హెచ్‌ఐవి మరణాల సంఖ్య 33% తగ్గుదల

ప్యారిస్ : నిధుల కొరత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి నివారణకు ప్రయత్నాలు ముందుకు సాగకపోయినా హెచ్‌ఐవి మరణాల సంఖ్య మాత్రం 2010 నాటి కన్నా 33 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఈ మరణాల సంఖ్య 7,70,000 కు తగ్గింది. ప్రస్తుతం 37.9 మిలియన్ మంది హెచ్‌ఐవితో బాధపడుతుండగా, వీరిలో 23.3 మిలియన్ మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందుబాటులో ఉండడం ఒక రికార్డుగా ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం తన వార్షిక […] The post హెచ్‌ఐవి మరణాల సంఖ్య 33% తగ్గుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ప్యారిస్ : నిధుల కొరత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా హెచ్‌ఐవి నివారణకు ప్రయత్నాలు ముందుకు సాగకపోయినా హెచ్‌ఐవి మరణాల సంఖ్య మాత్రం 2010 నాటి కన్నా 33 శాతం తగ్గిందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఈ మరణాల సంఖ్య 7,70,000 కు తగ్గింది. ప్రస్తుతం 37.9 మిలియన్ మంది హెచ్‌ఐవితో బాధపడుతుండగా, వీరిలో 23.3 మిలియన్ మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అందుబాటులో ఉండడం ఒక రికార్డుగా ఐక్యరాజ్యసమితి ఎయిడ్స్ విభాగం తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 1990లో ఎయిడ్స్ విజృంభించింది. అప్పటినుంచి ఈ వ్యాధి నివారణకు ప్రయత్నాలు పురోగతిలో సాగుతున్నాయి. 2017 లో 8,00,000 మంది ఈ వ్యాధితో చనిపోగా, గత ఏడాది 2018లో 7,70,000 మంది చనిపోవడం గమనార్హం.

అంటే 2010 నాటి మరణాల సంఖ్య 1.2 మిలియన్ కంటే మూడొంతుల వరకు 2018 నాటికి తగ్గుదల కనిపించింది. ఈ విధంగా తగ్గడం చెప్పుకోదగినదిగా అనుకుంటున్నా ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్‌పై పోరాటం మాత్రం రానురాను బలహీనమవుతోందని యుఎన్ నివేదిక ఆవేదన వెలిబుచ్చింది. ఆఫ్రికా ఇలాంటి అంటువ్యాధులకు ఆలవాలంగా ఉంటుందని భావిస్తున్నప్పటికీ ఈ దశాబ్దంలో చాలావరకు ఎయిడ్స్ మరణాలు తగ్గాయి. ఇదే సమయంలో తూర్పు ఐరోపాలో 5 శాతం, మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికాల్లో 9 శాతం వరకు ఎయిడ్స్ మరణాలు పెరగడం శోచనీయం. ఏటేటా క్రమంగా ఈ దేశాల్లో 29 శాతం, 10 శాతం వరకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధి నిర్మూలనకు అత్యవసర రాజకీయ ప్రమేయం పెంచడం అవసరమని యుఎన్ ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గినిల్లా క్లారిసన్ సూచించారు.

హెచ్‌ఐవి పీడితులైన వారిని కేవలం రోగుల పరంగా కాకుండా వారికి జీవించే మానవ హక్కుల కల్పన దృష్టితో కృషి చేసినప్పుడే వ్యాధి నిర్మూలన సాధ్యం కాగలదని అభిప్రాయ పడ్డారు. కొన్ని దశాబ్దాలుగా సాగించిన పరిశోధనల ఫలితంగా వ్యాక్సిన్ అందుబాటు లోకి వచ్చింది. 1980 నుంచి ఈ వ్యాధి 80 మిలియన్ మందికి సోకి, 35 మిలియన్ కన్నా ఎక్కువ మందిని బలిగొంది. ఇంట్రావీనస్ డ్రగ్ వినియోగదారులు, స్వలింగ సంపర్కులు, నపుంసకులు, సెక్సువర్కర్లు, ఖైదీలు తదితర వర్గాల నుంచి కొత్తగా సగానికి సగం ఎయిడ్స్ కేసులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో 50 శాతం మంది పీడితులు సగానికి సగం దేశాల్లో ప్రమాద పరిస్థితుల్లో వైద్యులను ఆశ్రయించడం జరుగుతోందని నివేదిక పేర్కొంది.

United Nations report 33% decrease of HIV deaths

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్‌ఐవి మరణాల సంఖ్య 33% తగ్గుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: