భారత్ వృద్ధి రేటు 7 శాతం

  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనాను తగ్గించిన ఎడిబి న్యూఢిల్లీ: ఆర్థిక కొరత ఆందోళనల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(201920) గాను భారత్ వృద్ధి రేటు అంచనాను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎడిబి(ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) తగ్గించింది. ఎడిబి 2019 నివేదికను గురువారం విడుదల చేసింది. 2019-20 గానూ భారత్ వృద్ధి 7శాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇంత క్రితం ఇదే ఏడాది(2019) ఏప్రిల్‌లో దేశీయ వృద్ధిరేటు అంచనా 7.2 శాతంగా ఉంటుందని […] The post భారత్ వృద్ధి రేటు 7 శాతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంచనాను తగ్గించిన ఎడిబి

న్యూఢిల్లీ: ఆర్థిక కొరత ఆందోళనల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(201920) గాను భారత్ వృద్ధి రేటు అంచనాను 7.2 శాతం నుంచి 7 శాతానికి ఎడిబి(ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) తగ్గించింది. ఎడిబి 2019 నివేదికను గురువారం విడుదల చేసింది. 2019-20 గానూ భారత్ వృద్ధి 7శాతం మాత్రమే నమోదవుతుందని అంచనా వేసింది. ఇంత క్రితం ఇదే ఏడాది(2019) ఏప్రిల్‌లో దేశీయ వృద్ధిరేటు అంచనా 7.2 శాతంగా ఉంటుందని బ్యాంకు అంచనా వేసింది. ఆర్థిక ఆందోళనలు వృద్ధి రేటు తగ్గింపునకు కారణమని బ్యాంకు వెల్లడించింది.

అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)వృద్ధి రేటు 7.2 శాతంగా నమోదవుతుందని ఎడిబి నివేదికలో తెలిపింది. అంచనా వృద్ధి కోత విధించినప్పటికీ దక్షిణ ఆసియా ప్రాంతంలో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశంగానే ఉందని ఎడిబి తెలిపింది. గతనెలలో భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా (జిఎస్‌పి) నుంచి తొలగిస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనతో మొత్తం దేశీయ ఎగుమతుల్లో 1.8 శాతం మాత్రమే ప్రయోజనం పొందిందని బ్యాంక్ పేర్కొంది.

ADB cuts India GDP growth forecast to 7%

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారత్ వృద్ధి రేటు 7 శాతం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: