ఎయిర్ ఇండియా విక్రయంపై అమిత్‌షా ఆధ్వర్యంలో మంత్రుల ప్యానెల్

  న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్యానెల్ నుంచి తప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్యానెల్ ఎయిర్ ఇండియా విక్రయం కోసం విధివిధానాలపై కసరత్తు చేయనున్నారు. ఈ మంత్రుల ప్యానెల్‌లో నలుగురు మంత్రులు అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్‌సింగ్ […] The post ఎయిర్ ఇండియా విక్రయంపై అమిత్‌షా ఆధ్వర్యంలో మంత్రుల ప్యానెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్యానెల్ నుంచి తప్పుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్యానెల్ ఎయిర్ ఇండియా విక్రయం కోసం విధివిధానాలపై కసరత్తు చేయనున్నారు. ఈ మంత్రుల ప్యానెల్‌లో నలుగురు మంత్రులు అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్, పౌర విమానయాన శాఖమంత్రి హర్దీప్‌సింగ్ పురి ఉంటారు.

ఎయిర్ ఇండియా ప్రత్యేక ప్రత్యామ్నాయ యంత్రాంగం(ఎఐఎస్‌ఎఎం) పేరిట ఈ ప్యానెల్‌ను 2017 జూన్‌లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులు అశోక్ గజపతి రాజు, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ ఉన్నారు. అయితే మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్కరీ ప్యానెల్‌లో భాగం కాలేదు. దీంతో ఎఐఎస్‌ఎఎంను మళ్లీ ఏర్పాటు చేయగా, దీనికి ఐదుగురు సభ్యులు కాకుండా నలుగురు మాత్రమే ఉన్నారు.

Panel of Ministers under Amit Shah on Air India sales

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎయిర్ ఇండియా విక్రయంపై అమిత్‌షా ఆధ్వర్యంలో మంత్రుల ప్యానెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: