అందుకే అవకాశాలు మిస్

  పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తానని హీరోయిన్లు అంటే నడిచే కాలం కాదిది. ఎంతో కొంత పట్టువిడుపు గ్లామర్ షోకు ఒప్పుకుంటేనే అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ మలయాళ భామ సాయి పల్లవి మాత్రం తన రూటే సెపరేట్ అంటోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ‘రౌడీ బేబీ…’ పాటలో అందాలొలించకుండా కేవలం తన స్టెప్పులతో ఉర్రూతలూగించడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమని చెప్పాలి. అయితే కెరీర్ మొదట్లో ఉన్నంత సక్సెస్ ఇప్పుడు ఈ బ్యూటీకి లేదనే […] The post అందుకే అవకాశాలు మిస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తానని హీరోయిన్లు అంటే నడిచే కాలం కాదిది. ఎంతో కొంత పట్టువిడుపు గ్లామర్ షోకు ఒప్పుకుంటేనే అవకాశాలు వెల్లువెత్తుతాయి. కానీ మలయాళ భామ సాయి పల్లవి మాత్రం తన రూటే సెపరేట్ అంటోంది. 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ‘రౌడీ బేబీ…’ పాటలో అందాలొలించకుండా కేవలం తన స్టెప్పులతో ఉర్రూతలూగించడం ఒక్క సాయి పల్లవికే సాధ్యమని చెప్పాలి. అయితే కెరీర్ మొదట్లో ఉన్నంత సక్సెస్ ఇప్పుడు ఈ బ్యూటీకి లేదనే చెప్పాలి.

నిజానికి సాయి పల్లవికి క్రేజీ ప్రాజెక్ట్ వస్తున్నప్పటికీ కేవలం తాను పెట్టుకున్న పరిమితుల వల్లే అవి మిస్ అవుతున్నాయని ఇన్‌సైడ్ టాక్. ‘డియర్ కామ్రేడ్’లో ముందుగా అనుకున్న హీరోయిన్ తనేనట. కానీ కథ ప్రకారం లిప్ లాక్స్ ఉంటాయని దర్శకుడు భరత్ కమ్మ చెప్పడంతో ఆమె ఈ సినిమా చేయనని చెప్పిందట. మహేష్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కు ముందు వినిపించిన పేరు కూడా సాయి పల్లవే. ఈ రెండు సినిమాల అవకాశాలు రష్మిక మందన్నకు దక్కడం విశేషం. ఈ నేపథ్యంలో సాయిపల్లవి గ్లామరస్‌గా కనిపించడానికి ఓకే చెప్పి క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటుందా అనేది చూడాలి.

Sai Pallavi rejected Dear Comrade over lip lock scene

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అందుకే అవకాశాలు మిస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: