ఒకే రోజు రెండు సినిమాలు

  ఒక స్టార్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం అరుదైన విషయమే. తెలుగుతో పాటు తమిళంలోనూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న స్టార్లకు ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతుంది. అందాల తార సమంత నటించిన తెలుగు, తమిళ చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలున్నాయి. ఇటీవల సూపర్ డీలక్స్ (తమిళ్),- యూటర్న్ (తెలుగు) చిత్రాలు అలాగే విడుదలయ్యాయి. సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ రెండు చిత్రాలు సమంతకు నటిగా ఎంతో పేరును తీసుకువచ్చాయి. ఒకేసారి […] The post ఒకే రోజు రెండు సినిమాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఒక స్టార్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం అరుదైన విషయమే. తెలుగుతో పాటు తమిళంలోనూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న స్టార్లకు ఇలాంటి అరుదైన అనుభవం ఎదురవుతుంది. అందాల తార సమంత నటించిన తెలుగు, తమిళ చిత్రాలు ఒకే రోజున విడుదలైన సందర్భాలున్నాయి. ఇటీవల సూపర్ డీలక్స్ (తమిళ్),- యూటర్న్ (తెలుగు) చిత్రాలు అలాగే విడుదలయ్యాయి. సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ రెండు చిత్రాలు సమంతకు నటిగా ఎంతో పేరును తీసుకువచ్చాయి. ఒకేసారి రిలీజ్ కావడంతో ప్రమోషన్స్ కోసం సమంత చాలానే టెన్షన్ పడింది. ఈసారి ఆ తరహా అనుభవం స్టార్ బ్యూటీ కాజల్‌కు ఎదురుకానుంది.

ఒకటి తెలుగు రిలీజ్.. మరొకటి తమిళంలో రిలీజ్. దీంతో కాజల్ ప్రచార హడావుడితో ఉక్కిరిబిక్కిరి కానుంది. కాజల్ నటించిన తెలుగు చిత్రం ‘రణరంగం’, తమిళ చిత్రం ‘కోమలి’ ఆగస్టు 15న రిలీజవుతున్నాయి. రణరంగం, కోమలి చిత్రాల్లో కాజల్ ఆసక్తికరమైన పాత్రల్ని పోషిస్తోందట. ఈ రెండు సినిమాల ప్రమోషన్స్‌కి కాజల్ సిద్ధమవుతోంది. శర్వా సరసన ‘రణరంగం’లో కాజల్ అద్భుతమైన నటనతో మెప్పిస్తుందట. గ్యాంగ్ స్టర్ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం రక్తి కట్టించనుంది.

ఇక తమిళ చిత్రం ‘కోమలి’లో జయం రవి కథానాయకుడు. ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో జయం రవి ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుండగా అతని సరసన కాజల్ ఉద్వేగాలు పలికించే పాత్రలో కనిపించబోతోందట. రకరకాల జనరేషన్స్ లుక్‌తో జయం రవి పోస్టర్లు ఇప్పటికే తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. అందుకే కాజల్ పాత్రకు, నటనకు స్కోప్ ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. ఒకేసారి ఈ రెండు సినిమాలు విజయాలు సాధిస్తే కాజల్ పేరు మార్మోగుతుంది.

Kajal gearing up for two releases on Independence Day

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఒకే రోజు రెండు సినిమాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: