తోటి హోంగార్డుకు ఆర్థిక సాయం…

  మనతెలంగాణ,హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్‌పై నుంచి కిందపడడంతో గాయపడిన హోంగార్డుకు సైబరాబాద్ హోంగార్డు అసోసియేషన్ తరఫున రూ.5,200 ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో గురువారం సెక్షన్ ఇన్‌చార్జ్ ఎఎస్సై రామచంద్ర, అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ నగదును అందజేశారు. నాగుల్ మీరా విధులు ముగించుకుని మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో మూడు నెలలు చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు […] The post తోటి హోంగార్డుకు ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మనతెలంగాణ,హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు మోటార్ సైకిల్‌పై నుంచి కిందపడడంతో గాయపడిన హోంగార్డుకు సైబరాబాద్ హోంగార్డు అసోసియేషన్ తరఫున రూ.5,200 ఆర్థిక సాయం అందజేశారు. గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో గురువారం సెక్షన్ ఇన్‌చార్జ్ ఎఎస్సై రామచంద్ర, అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ నగదును అందజేశారు. నాగుల్ మీరా విధులు ముగించుకుని మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. దీంతో మూడు నెలలు చికిత్స పొందుతూ ఇంటి వద్దే ఉన్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో హోంగార్డు అసోసియేషన్ సభ్యులు తమ తోటి ఉద్యోగికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో హోంగార్డు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, గురు ఆర్యా, గోపాల్ పాల్గొన్నారు.

Cyberabad HGA Financial support for Home Guard

The post తోటి హోంగార్డుకు ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: