గవర్నర్‌తో కేసీఆర భేటీ..

  హైదరాబాద్: సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ ను రాజ్ భవన్ లో గురువారం సమావేశం అయ్యారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం నేరుగా సిఎం కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన గవర్నర్‌ నరసింహన్ తో భేటి అయ్యారు. ఎపికి ప్రత్యేక గవర్నర్‌ను నియమించిన తర్వాత కెసిఆర్, గవర్నర్ నరసింహన్‌ను తొలిసారిగా కలిశారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర […] The post గవర్నర్‌తో కేసీఆర భేటీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్‌ ను రాజ్ భవన్ లో గురువారం సమావేశం అయ్యారు. శాసన సభ వాయిదా పడిన అనంతరం నేరుగా సిఎం కెసిఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లిన గవర్నర్‌ నరసింహన్ తో భేటి అయ్యారు. ఎపికి ప్రత్యేక గవర్నర్‌ను నియమించిన తర్వాత కెసిఆర్, గవర్నర్ నరసింహన్‌ను తొలిసారిగా కలిశారు. ఇరువురి మధ్య రాష్ట్రంలోని తాజా పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. శాసనసభ ప్రత్యేక సమావేశాలు, కొత్త పురపాలక చట్టం, పురపాలక ఎన్నికలు తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన అంశాల పురోగతిని, ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీటి వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

CM KCR Meet With Governor Narasimhan in Raj Bhavan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గవర్నర్‌తో కేసీఆర భేటీ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: