ఆలయంలో తొక్కిసలాట …ముగ్గురు మృతి

తమిళనాడు : కాంచీపురంలోని అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎపికి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. స్థానిక అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. 48 రోజుల పాటు ఈ  […] The post ఆలయంలో తొక్కిసలాట … ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తమిళనాడు : కాంచీపురంలోని అత్తివరద రాజస్వామి ఉత్సవాల్లో గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు. మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఎపికి చెందిన మహిళతో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు ఆలయ అర్చకులు తెలిపారు. స్థానిక అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఈ నెల 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. 48 రోజుల పాటు ఈ  ఉత్సవాలు జరగనున్నాయి. గురువారం  శ్రవణా నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. ఈ క్రమంలో క్యూలైన్లలో తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారని,  వీరిలో గుంటూరుకు చెందిన నారాయణమ్మ అనే మహిళ కూడా ఉందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు  చెన్నై, సేలంకు చెందిన వారిగా గుర్తించారు. భక్తుల రద్దీ కారణంగా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని గర్భిణులకు, వృద్ధులకు కలెక్టర్‌ సూచించారు.

Stampede In Temple : 3Devotees Dead

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆలయంలో తొక్కిసలాట … ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: