టోరెంటోలో ప్రతి ఏడాది వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం

  వాలీబాల్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం 500 మంది మద్ధతుదారులతో ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేశాం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గణగోని మనతెలంగాణ/హైదరాబాద్: టోరెంటోలో వాలీబాల్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిఏటిఏ, టాటా) ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గణగోని పేర్కొన్నారు. టాటా సంస్థ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి భారీ సంఖ్యలో ఆటగాళ్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. […] The post టోరెంటోలో ప్రతి ఏడాది వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వాలీబాల్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం
500 మంది మద్ధతుదారులతో ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేశాం
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గణగోని
మనతెలంగాణ/హైదరాబాద్: టోరెంటోలో వాలీబాల్ టోర్నమెంట్లను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టిఏటిఏ, టాటా) ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గణగోని పేర్కొన్నారు. టాటా సంస్థ ఆధ్వర్యంలో మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించినట్టు ఆయన పేర్కొన్నారు. దీనికి భారీ సంఖ్యలో ఆటగాళ్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. వివిధ కోర్టుల్లో 20 జట్లు 200 మంది ఆటగాళ్లు పాల్గొన్నారన్నారు. సుమారు 500 మంది మద్ధతు దారులతో ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని చూసుకున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ కార్యకలాపాలతో తెలుగు సమాజంలో చాలా చురుగ్గా ముందుకెళుతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ మెగా టోర్నమెంట్‌ను టాటా సంస్థ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మల్లారెడ్డి, ఎసి సభ్యుడు డాక్టర్ మోహన్ మార్గదర్శకత్వంలో నిర్వహించినట్టు ఆయన తెలిపారు. విక్రమ్ జంగం, కిరణ్ దుద్దగి, శ్రీకాంత్ అక్కపల్లి, శ్రావణ నాగపురి, మహేందర్ నారాలా, విజయ్ భాస్కర్ కలాల్‌లు ఈ టోర్నీ విజయవంతం కావడానికి సహకరించారని ఆయన తెలిపారు. యూఎస్‌తో పాటు ఇండియా జాతీయం గీతాలను ఆలపించి ఈ టోర్నీలను ప్రారంభించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అజి పాటిల్, ఎడిసన్ టౌన్ షిప్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్‌లు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని, ఈ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించినందుకు టాటా అసోసియేషన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. టిఎఫ్‌ఎఎస్ ప్రెసిడెంట్ సుధాకర్ ఉప్పాలా ఈ క్రీడల్లో పాల్గొన్న వారితో సమావేశమై వారిలో ఉత్సాహాన్ని కలిగించారు.

We conducted Volleyball tournaments in Toronto: Srinivas

The post టోరెంటోలో ప్రతి ఏడాది వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.