39 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కచెల్లెళ్లను కలిపిన సోషల్ మీడియా

  అమరావతి: 39 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కచెల్లెళ్లు ఇప్పుడు కలుసుకోబోతున్నా సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. జ్యోతి, కమల అనే అక్కచెల్లెళ్లు ఉండేవారు. 1980వ సంవత్సరంలో జ్యోతికి ఐదేళ్లు ఉన్నప్పుడు కమలను మిజోరం రాష్ట్రానికి చెందిన సైనికుడు మింగ్లియాన్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కమలను తన సొంత రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అతడి గురించి మిజోరం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కమల కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. అప్పటి నుంచి జ్యోతి తన అక్క కమల కోసం […] The post 39 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కచెల్లెళ్లను కలిపిన సోషల్ మీడియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: 39 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కచెల్లెళ్లు ఇప్పుడు కలుసుకోబోతున్నా సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. జ్యోతి, కమల అనే అక్కచెల్లెళ్లు ఉండేవారు. 1980వ సంవత్సరంలో జ్యోతికి ఐదేళ్లు ఉన్నప్పుడు కమలను మిజోరం రాష్ట్రానికి చెందిన సైనికుడు మింగ్లియాన్ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కమలను తన సొంత రాష్ట్రానికి తీసుకెళ్లాడు. అతడి గురించి మిజోరం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కమల కుటుంబ సభ్యులు వెనుదిరిగారు. అప్పటి నుంచి జ్యోతి తన అక్క కమల కోసం వెదుకుతూనే ఉంది. 2013లో మిజోరం నుంచి హైదరాబాద్ కు ఓ జవాను వస్తే వెళ్లి కలిశామని కమల చనిపోయిందని అతడు చెప్పాడు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు నిరాశకు గురైన జ్యోతి తన అక్క జాడ కోసం వెతుకుతూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో మిజోరంకు సంబందించిన ఫేస్‌బుక్ గ్రూప్‌లో జ్యోతి ఫోటో పెట్టి తన అక్క ఆచూకీ తెలపాలని పోస్టు చేసింది. వెంటనే ఆ గ్రూపులో ఉన్న మెంబర్స్ ఫోటోను షేర్ చేయడంతో వైరల్ గా మారింది. దీంతో అక్క ఆచూకీ దొరకడంతో జ్యోతి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కమల భర్త అసలు పేరు లల్లియాన్‌జరా 2013లో కేన్సర్ వ్యాధితో చనిపోయాడు. కమలకు నలుగురు సంతానంలో ముగ్గురికి పెళ్లిలు చేయడంతో ఆర్థికంగా బలహీన స్థితిలో ఉంది. ప్రస్తుతం తన కుమారుడితో కలిసి జీవనం సాగిస్తోంది. త్వరలో తన అక్క కమలను కలుస్తానని జ్యోతి సోషల్ మీడియాలో తెలిపారు. తనకు సహాయం చేసిన సోషల్ మీడియా గ్రూప్ సభ్యులకు జ్యోతి థ్యాంక్స్ చెప్పింది.

Sister Meet Elder Sister in Face Book after 39 Years

The post 39 ఏళ్ల క్రితం విడిపోయిన అక్కచెల్లెళ్లను కలిపిన సోషల్ మీడియా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: