విశ్రాంతికి చెక్…. విండీస్ పర్యటనకు కోహ్లీ?

ముంబయి: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టీమిండియా.. మూడు వన్డేలు, మూడు టి20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.  ఈ నెల 19న ముంబయిలో సెలక్షన్ కమిటీ సమావేశమై విండీస్ టూర్ కోసం భారత జట్టు ఎంపిక చేయనుంది.అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి తీరిక లేని క్రికెట్ ఆడుతుండటంతో కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావించినట్లు సమాచారం. దీంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. […] The post విశ్రాంతికి చెక్…. విండీస్ పర్యటనకు కోహ్లీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి: వచ్చే నెలలో వెస్టిండీస్‌తో టీమిండియా.. మూడు వన్డేలు, మూడు టి20లు, రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.  ఈ నెల 19న ముంబయిలో సెలక్షన్ కమిటీ సమావేశమై విండీస్ టూర్ కోసం భారత జట్టు ఎంపిక చేయనుంది.అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి తీరిక లేని క్రికెట్ ఆడుతుండటంతో కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ భావించినట్లు సమాచారం. దీంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా,  విరాట్ కోహ్లీ ప్రపంచకప్ లో అంతగా రాణించకపోవడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో… కోహ్లీ, విండీస్ పర్యటనకు విశ్రాంతి తీసుకోకుండా 3 ఫార్మాట్లలోనూ ఆడి, తన ఆటతోనే విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సెలక్టర్లను కూడా సంప్రదించినట్లు సమాచారం.

Virat Kohli ready to West Indies tour

The post విశ్రాంతికి చెక్…. విండీస్ పర్యటనకు కోహ్లీ? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: