20 మిలియన్ పిల్లలకు అందని వ్యాక్సిన్లు

జెనీవా : నివారించ గల వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఇచ్చే వ్యాక్సిన్లు గత ఏడాది 20 మిలియన్ పిల్లలకు పూర్తిగా అందలేదు. గత ఏడాది 19.4 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునిసెఫ్ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నాయి. ఇదే విధంగా 2017లో 18.7 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందకపోవడం గమనార్హం. యుద్ధవాతావరణం, అసమానతల కారణంగా ప్రపంచ వ్యాక్సిన్ రేటు స్తంభించింది. ఇది ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. శిశు జననాలు ఎలా ఉన్నాయో […] The post 20 మిలియన్ పిల్లలకు అందని వ్యాక్సిన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జెనీవా : నివారించ గల వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి ఇచ్చే వ్యాక్సిన్లు గత ఏడాది 20 మిలియన్ పిల్లలకు పూర్తిగా అందలేదు. గత ఏడాది 19.4 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందలేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునిసెఫ్ తమ వార్షిక నివేదికలో పేర్కొన్నాయి. ఇదే విధంగా 2017లో 18.7 మిలియన్ పిల్లలకు వ్యాక్సిన్ అందకపోవడం గమనార్హం. యుద్ధవాతావరణం, అసమానతల కారణంగా ప్రపంచ వ్యాక్సిన్ రేటు స్తంభించింది.

ఇది ప్రమాదకరమని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. శిశు జననాలు ఎలా ఉన్నాయో సమాచారం లేకపోయినా ప్రాణాంతక వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ వినియోగంలో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదని పేర్కొంది. గత ఏడాది 3,50,000 తట్టు వ్యాధి, పొంగువ్యాధి కేసులు నమోదు కాగా, 2017 నాటి సంఖ్యతో పోల్చితే ఇది రెట్టింపు అని చెప్పవచ్చు. 2019 మొదటి క్వార్టర్‌లో కేసుల సంఖ్యను గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోల్పితే దాదాపు 300 రెట్లు ఎక్కువని తేలింది.

Vaccines not available to 20 million children
సైన్స్ విభాగం

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 20 మిలియన్ పిల్లలకు అందని వ్యాక్సిన్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: