చంద్రునిపై టెలిస్కోప్‌ల అమరికకు రోబోల సాయం

వాషింగ్టన్ : ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుని పైకి వ్యోమగాములను పంపే ప్రయత్నంలో అమెరికా కొలొరొడొ లోని నాసా ఆర్థిక వనరుల ఆధారంగా ఏర్పాటైన ప్రయోగశాల అక్కడ టెలిస్కోప్‌లను ఏర్పాటు చేసేందుకు రోబోలను పంపడానికి సన్నాహాలు చేస్తోంది. చంద్రుని అవతల వైపు రేడియో టెలిస్కోప్‌లను అమర్చుతారు. దీనివల్ల అమెరికా అంతరిక్ష సంస్థ తోపాటు ప్రైవేటు కంపెనీలు ఇతర దేశాలు వచ్చే దశాబ్దాల్లో మూన్‌స్కేప్‌ను మార్చ గలుగుతారు. ఇది తాతల నాటి అపోలో ప్రోగ్రామ్ లా కాకుండా […] The post చంద్రునిపై టెలిస్కోప్‌ల అమరికకు రోబోల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వాషింగ్టన్ : ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుని పైకి వ్యోమగాములను పంపే ప్రయత్నంలో అమెరికా కొలొరొడొ లోని నాసా ఆర్థిక వనరుల ఆధారంగా ఏర్పాటైన ప్రయోగశాల అక్కడ టెలిస్కోప్‌లను ఏర్పాటు చేసేందుకు రోబోలను పంపడానికి సన్నాహాలు చేస్తోంది. చంద్రుని అవతల వైపు రేడియో టెలిస్కోప్‌లను అమర్చుతారు. దీనివల్ల అమెరికా అంతరిక్ష సంస్థ తోపాటు ప్రైవేటు కంపెనీలు ఇతర దేశాలు వచ్చే దశాబ్దాల్లో మూన్‌స్కేప్‌ను మార్చ గలుగుతారు. ఇది తాతల నాటి అపోలో ప్రోగ్రామ్ లా కాకుండా టెలిస్కోప్ ప్రాజెక్టు పైనే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇది చాలా వైవిధ్యమైన ప్రోగ్రామ్. యంత్రాలు, మానవులు కలసి పనిచేస్తారు. కొంత కాలానికి శాస్త్రవేత్తల బృందం చంద్రుని అవతల వైపునకు లూనార్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోవర్‌ను పంపిస్తుంది. ఈ రోవర్ చంద్రుని గరుకు ఉపరితలంపై పాక గలుగుతుంది. ఎత్తయిన కొండలను ఎక్క గలుగుతుంది. మనుషుల స్వల్ప సాయంతో రేడియో టెలిస్కోప్‌ల నెట్‌వర్కును అమర్చ గలుగుతుంది. పసడెనా, కాలిఫోర్నియా లోని నాసా జెట్ ప్రొపల్సన్ లేబొరేటరీలో ఈ రోవర్ తయారవుతోంది. చంద్రుని విభిన్న ఉపరితలంపై టెలిస్కోప్‌లను అమర్చ గలుగుతుంది.

Robots assist in the installation of telescopes on the moon

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చంద్రునిపై టెలిస్కోప్‌ల అమరికకు రోబోల సాయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.