సభకు హాజరీ ఎంఎల్‌ఎల ఇష్టం

  రాజీనామాల అంశం స్పీకర్ పరిధిలోనిది కర్నాటక వ్యవహారంపై సుప్రీం తీర్పు మరింత ఉత్కంఠగా నేటి బలపరీక్ష న్యూఢిల్లీ : కర్నాటకకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఏ విధమైన ఒత్తిడికి గురి చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్నాటక సంకీర్ణ సంక్షోభంలోని కీలక అంశం అయిన ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. సభ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనేది వారి ఇష్టం. రావాలనే ప్రోద్బలానికి […] The post సభకు హాజరీ ఎంఎల్‌ఎల ఇష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాజీనామాల అంశం స్పీకర్ పరిధిలోనిది
కర్నాటక వ్యవహారంపై సుప్రీం తీర్పు

మరింత ఉత్కంఠగా నేటి బలపరీక్ష

న్యూఢిల్లీ : కర్నాటకకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని ఏ విధమైన ఒత్తిడికి గురి చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్నాటక సంకీర్ణ సంక్షోభంలోని కీలక అంశం అయిన ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. సభ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనేది వారి ఇష్టం. రావాలనే ప్రోద్బలానికి గురి చేయడం కుదరదు. ఇక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవల్సింది అసెంబ్లీ స్పీకరే అని కూడా స్పష్టం చేసింది. స్పీకర్ తాను సముచితం అనుకున్న గడువులోగా రాజీనామాలపై నిర్ణయం తీసుకోవచ్చునని ధర్మాసనం తెలిపింది. అసమ్మతి ఎమ్మెల్యేలు, దీనికి ప్రతిగా స్పీకర్, సిఎం వేర్వేరుగా దాఖలు చేసుకున్న పిటిషన్లపై వారి వారి తరఫున సీనియర్ లాయర్ల వాదనలు మంగళవారం ముగిశాయి.

బుధవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. గురువారం కర్నాటక అసెంబ్లీలో కుమారస్వామి విశ్వాస తీర్మాన ప్రస్తావన జరిగే దశలో ఈ తీర్పు పరిణామాలు కీలకంగా మారాయి. అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా అనేది ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా నిర్ణయించుకోవచ్చు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యేల రాజీనామాల అంశంలో స్పీకర్‌కు ఉండే నిర్ణయాధికారానికి న్యాయస్థానం ఆదేశాలు కానీ వ్యాఖ్యలు కానీ ప్రతిబంధకాలు కారాదని కూడా ధర్మాసనం పేర్కొంది. స్పీకర్ తమ పరిధిలోనికి వచ్చే అంశంపై స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉందని తెలిపింది.

అయితే రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం గురించి న్యాయస్థానానికి తెలియచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం సాగుతున్న అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా అనేది ఎమ్మెల్యేలే నిర్ణయించుకోవల్సి ఉంటుందని కూడా సంబంధిత ఆదేశాలు వెలువరిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం మూడు పేజీల తీర్పు వెలువరించింది. సభకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని కాంగ్రెస్ జెడిఎస్ సంకీర్ణం జారీ చేసిన విప్ ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్‌తో చెల్లనేరకుండా పోతుంది.

రాజ్యాంగ సమతౌల్యం కీలకం
తమ ముందుకు వచ్చిన ఈ కీలక అంశంలో ప్రస్తుత దశలో రాజ్యాంగ సమతౌల్యంను పాటించాల్సి ఉంది. వైరుద్ధ, పరస్పర పోటాపోటీ హక్కుల అంశాలపై కూడా దృష్టి సారించాల్సి వచ్చింది. అంతేకాకుండా కర్నాటక అసెంబ్లీలో గడువులోగా జరగాల్సి ఉన్న ప్రక్రియల నేపథ్యంలో ఇప్పటి తాత్కాలిక స్పందన అవసరం అయింది. ప్రస్తుత ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం గురువారం ప్రస్తావనకు వస్తుందనే విషయం తమ దృష్టికి వచ్చిందని ధర్మాసనం తెలిపింది. ఈ దశలో అన్ని వాదనలు, కాల పరిమితిలో చేపట్టాల్సిన ప్రక్రియల నేపథ్యంలో తీర్పు వెలువరిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ అధికరణల మేరకు స్పీకర్ విచక్షణాయుత అధికారాలను నిర్వర్తించే దిశలోనే తమ తీర్పులోని అంశాలు ఉన్నాయని, ఏ విధంగా కూడా స్పీకర్ అధికారాలను ప్రభావితం చేయడం లేదని స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తాం : స్పీకర్
సుప్రీంకోర్టు తీర్పును కర్నాటక స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ స్వాగతించారు. రాజీనామాలపై నిర్ణయాధికారం స్పీకర్‌కే వదిలిపెట్టడంపై ఆయన స్పందించారు. రాజ్యాంగ సూత్రాలకు, అనుగుణంగా తాను సభా ధర్మం పాటిస్తానని బెంగళూరులో తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాను మన్నిస్తున్నట్లు , తీర్పుతో తనపై అదనపు భారం పడిందని, అత్యంత మెళకువగా రాజ్యాంగయుతంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తానని ప్రకటించారు.

అసెంబ్లీకి హాజరయ్యేది లేదు : రెబెల్స్
కర్నాటకపై సుప్రీంకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని రెబెల్ ఎమ్మెల్యేలు స్పందించారు. ముంబైలో ఒక హోటల్‌లో క్యాంప్‌లో ఉన్న వీరు వార్తా సంస్థలతో మాట్లాడారు. తాము అసెంబ్లీకి హాజరయ్యే ప్రసక్తే లేదని ప్రముఖ రెబెల్ ఎమ్మెల్యే బిసి పాటిల్ తెలిపారు. వీడియోలో రికార్డు చేసిన వీరి స్పందన వెలుగులోకి వచ్చింది. రాజీనామాలపై వెనకకు పొయ్యే ప్రసక్తే లేదని, అదే విధంగా అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. తాము ఒక్క నిర్ణయానికి వచ్చామని దీనికే కట్టుబడి ఉంటామన్నారు.

రెబెల్ ఎమ్మెల్యేలకు బలం : యడ్యూరప్ప
సుప్రీంకోర్టు తీర్పుతో రెబెల్ ఎమ్మెల్యేలకు బలం చేకూరిందని, ఇది వారి నైతిక విజయం అని బిజెపి నేత బిఎస్ యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. రాజీనామాలకు దిగిన ఎమ్మెల్యేలపై సభకు హాజరు కావాలనే విప్ జారీ చేయడం కుదరదని యడ్యూరప్ప చెప్పారు. ఇక వారు సభకు హాజరు కావాలని కట్టడి చేయడం తగదని, హాజరీ ఎమ్మెల్యేల ఇష్టాయిష్టాల అంశం అని సుప్రీంకోర్టు పేర్కొందని, ప్రభుత్వ మనుగడకు ఇది కీలకం అని బిజెపి నేత బెంగళూరులో తెలిపారు. సుప్రీం స్పష్టమైన తీర్పుతో ప్రభుత్వ మైనార్టీతనం మరింతగా వెలుగులోకి వచ్చినట్లే అని, ఇక ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు దిగాల్సిందేనని , ఇది గురువారం బలపరీక్షకు ముందు చేస్తారా? తరువాతనా? అనేది ఆయన ఇష్టం అని యడ్యూరప్ప విలేకరులకు తెలిపారు.

దారుణమైన న్యాయపర సాంప్రదాయం : కాంగ్రెస్ పార్టీ స్పందన
ఎమ్మెల్యేల హాజరీకి విప్‌ను దెబ్బతీసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ప్రజాతీర్పునకు ద్రోహం చేసిన రెబెల్ ఎమ్మెల్యేలకు సంపూర్ణ రక్షణ కల్పించే విధంగా ఉన్న తీర్పు అత్యంత క్రూరమైన న్యాయ సంవిధానానికి దారిసిందని తీవ్రంగా స్పందించారు. దేశ రాజధానిలో పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా విలేకరులతో మాట్లాడారు. ప్రజల తీర్పును కాదనే రీతిలో వ్యవహరించే ఎమ్మెల్యేలను తగు విధంగా శిక్షించే అధికారం వేటు వేసే అధికారపు పరిధి చట్టం ప్రకారం ఉందని, అయితే ఇందుకు అనుగుణంగా ఉండే విప్‌ను నామమాత్రం చేస్తూ వెలువడ్డ తీర్పులోని అంశాలపై ఏమనాల్సి ఉంటుందని సూర్జేవాలా స్పందించారు. సిద్థాంతపరంగా కాకుండా వారి బాగోగులు లాభాల గురించి గంతులేసే కొందరు ఎమ్మెల్యేలకు పూర్తిస్థాయి సంరక్షణను కల్పించడం, వారిని కట్టడి చేయడం కుదరదని చెప్పడం ద్వారా తెలియచేయడం దారుణం అని పార్టీ ప్రతినిధి విమర్శించారు. అటువంటి వారికి ఇటువంటి రక్షణ కల్పించడం ఇంతకు ముందెప్పుడూ వినని కనని విషయం అన్నారు.

SC gives Speaker power to decide on rebel MLAs resign

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సభకు హాజరీ ఎంఎల్‌ఎల ఇష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: