ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు ఐఏఎస్ అండ!

  పరికరాల కొనుగోళ్లలో వ్యాపార భాగస్వామిగా… ఆమె అవినీతిలో అతనూ పాత్రధారుడే ఐఏఎస్ పాత్రపై ఆరా తీస్తున్న ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణికి మొదటి నుంచి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వత్తాసు పలుకుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి డైరెక్టర్ దేవికారాణి నిబంధనలను తుంగలో తొక్కేదని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆమె అవినీతికి తోడుగా అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు అన్నీ తామై […] The post ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు ఐఏఎస్ అండ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పరికరాల కొనుగోళ్లలో వ్యాపార భాగస్వామిగా… ఆమె అవినీతిలో అతనూ పాత్రధారుడే
ఐఏఎస్ పాత్రపై ఆరా తీస్తున్న ప్రభుత్వం

పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సిఎం ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈఎస్‌ఐ డైరెక్టర్ దేవికారాణికి మొదటి నుంచి ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వత్తాసు పలుకుతున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొదటి నుంచి డైరెక్టర్ దేవికారాణి నిబంధనలను తుంగలో తొక్కేదని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆమె అవినీతికి తోడుగా అక్కడ పనిచేసే కొందరు ఉద్యోగులు అన్నీ తామై వ్యవహారించేవారని తెలుస్తోంది. ఆమె ఆగడాలు శృతిమించడంతో పలువురు ఉద్యోగులు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్‌శాఖ ఈ ఫిర్యాదులపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం దీనికి సంబంధించిన నివేదికను ఆ శాఖ ఉన్నతాధికారులకు 2019, ఫిబ్రవరిలో విజిలెన్స్ అధికారులు అందచేశారు.

అయితే ఆమెకు మొదటి నుంచి అండగా ఉన్న ఓ ఐఏఎస్ ఆ నివేదికను బయటకు రాకుండా చూసుకున్నట్టుగా తెలిసింది. ఆయన కూడా ఆమెతో కలిసి పరికరాల కొనుగోళ్లకు సంబంధించి ఓ సంస్థను తెరపైకి తీసుకు రావడమే కాకుండా ఆమెతో వ్యాపార భాగస్వామిగా మారి పరికరాలను కొనుగోలు చేసినట్టుగా సమాచారం. కొత్తగా నెలకొల్పిన ఆ సంస్థ ద్వారానే ఈఎస్‌ఐ ఆస్పత్రులతో పాటు డిస్పెన్షరీలకు పరికరాలను కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఈ కొనుగోళ్లకు సంబంధించి టెండర్లు లేకుండా డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆమె చాంబర్‌లోకి తనకు అత్యంత దగ్గరగా ఉన్న వారినే లోపలికి పిలిచేవారని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆమెకు అన్నీ తామై వ్యవహారించే ఉద్యోగులు వారు చెప్పిన విధంగా అక్కడ నడిచేదని ఉద్యోగులు వాపోతున్నారు.

ఆమె తన ఛాంబర్‌లోకి రానివ్వదని…
జిల్లాలో పనిచేసే అధికారులతో పాటు ఉద్యోగులు తమను బాధను చెప్పు కోవాలంటే ముందుగా ఆమెకు నమ్మకమైన వారి తో మాట్లాడిన తరువాతే వారి సమస్య పరిష్కారం అయ్యేదని బాధిత ఉద్యోగు లు పేర్కొంటున్నారు ప్రతి పనికి ఒక రేటును వారు మాట్లాడే వారని, వారిని కాదని వెళ్లిన వారు చెప్పులు అరిగేలా తిరగాల్సిందేనని బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ఏదైనా సమస్యను చెప్పుకోవాలంటే కనీసం ఆమె తన చాంబర్‌లోకి రానివ్వదని ఇలాంటి డైరెక్టర్‌ను ఎప్పుడూ చూడలేదని వారు పేర్కొంటున్నారు. ఐఏఎస్‌తో ఆమె బిజినెస్ లావాదేవీలు ఎప్పుడైతే ప్రారంభించిందో అప్పటి నుంచి ఆమె ఆగడాలు మరింత శృతిమిం చి పోయాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎవరూ తన ను ఏమీ చేయలేరని, తనకు సచివాలయంలో పెద్ద ఎత్తున పలుకుబడి ఉందని, వారికి కూడా తన వ్యాపారంలో భాగస్వామ్యం ఉందని, పలు సందర్భాల్లో తోటి ఉద్యోగులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.

ఐఏఎస్ చెప్పినట్టుగా కమీషన్ రూపంలో చెల్లింపులు
గతంలో పరికరాలను టిఎస్‌ఎంఐడిసి (గ్రీన్ ఆపిల్, ట్రాన్స్ ఏషియా) సంస్థ ద్వారా టెండర్లను పిలిచి కొనుగోలు చేయాల్సి ఉండగా దానిని కాదనీ ఆ ఐఏఎస్‌తో కలిసి పరికరాల కొనుగోలుకు లైఫ్‌కేర్ అనే బినామీ సంస్థను సృష్టించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థ ద్వారానే పలు పరికరాలను కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. మందుల కొనుగోళ్ల విషయంలో అవసరం లేకు న్నా కొనుగోలు చేశారని, ఈ నేపథ్యంలో వాటిలో చాలావరకు పనికిరాకుండా పోయాయని ఉద్యోగు లు ఆరోపిస్తున్నారు.

గతంలో దేవికారాణి నాచారంలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మైక్రోబయాలజిస్టు (సివిల్ సర్జన్‌గా) విధులు నిర్వహించేవారు. అనంతరం 2015 లో ఆమె డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచే బినామీ సంస్థలు పుట్టుకొచ్చాయని అధికారులు గుర్తించారు. గతంలో ఆమెపై పలు జిల్లాల అధికారుల తో పాటు ఉద్యోగులు ఫిర్యాదు చేసినా ఆమెకు సన్నిహితంగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి వాటిని బయటకు రాకుండా చూసుకున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. డైరెక్టర్ బినామీ ఆస్తుల ద్వారా వచ్చిన డబ్బును ఆ ఐఏఎస్ చెప్పిన వారికి కమీషన్ రూపంలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆమె విషయంలో ఎవరూ ఏమీ చేయలేక పోయారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన కొందరు సిఎం కెసిఆర్‌కు ఫిర్యా దు చేయడంతో ఏసిబి అధికారులు రంగంలోకి దిగారని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఆమె ఆగడాలకు గతంలో చాలామంది బలయ్యారు
ఈ నేపథ్యంలో వ్యాపారంలో ఉన్న భాగస్వామి ఐఏఎస్ ఆమెను కాపాడలేక తన పేరు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఈ విషయమై కూడా ఫిర్యాదులు అందాయని, ఎవరెవరికి డైరెక్టర్ కమీషన్‌లను చెల్లించదన్న వివరాల గురించి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. డైరెక్టర్ దేవికారాణి పరికరాలతో పాటు మందుల కొనుగోళ్లలో అంతులేని అవినీతికి పాల్పడడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని సిఎస్‌ను సిఎం ఆదేశించినట్టుగా తెలిసింది. గతంలో కార్మిక సంఘాలు ఉద్యమించినా సచివాలయం స్థాయిలో ఆమెపై చర్యలు తీసుకోకుండా కొంద రు కొమ్ము కాశారని, ప్రస్తుతం వారంతా బయటకు రాక తప్పదని కార్మికులతో పాటు ఉద్యోగులు పేర్కొంటున్నా రు. ఇప్పటికైనా ఆమెపై చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆమె ఆగడాలకు గతంలో చాలామంది బలి అయ్యారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

ఆరోపణలు అవాస్తవం: దేవికారాణి
బుధవారం డైరెక్టర్ దేవికారాణి ఓ చానల్‌తో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని, తనకు వాటికి ఎలాంటి సంబంధం లేదని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ హోదాలో ఉన్నందున తన పేరును కొందరు కావాలనే ఇందులో ఇరికించారన్నారు. ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు అడిగిన విషయాలకు తాను సమాధానం ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.

Vigilance unearths drug purchase scam in ESI hospitals

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు ఐఏఎస్ అండ! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.