మల్టీ బ్రాండ్ రిటైల్‌కు అనుమతివ్వం

  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీ: మల్టీ బ్రాండ్ రిటైల్ నిర్వహణకు విదేశీ కంపెనీలను అనుమతించే ప్రతిపాదనేది లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో స్పష్టం చేశారు. రిటైల్ రంగం వృద్ధికి ఆటంకం కలిగించే నియమ నిబంధనలను సరళీకృతం చేసి రిటైల్ వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికోసం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన (పిఎం-ఎల్‌విఎంవై) అనే కొత్త పెన్షన్ […] The post మల్టీ బ్రాండ్ రిటైల్‌కు అనుమతివ్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: మల్టీ బ్రాండ్ రిటైల్ నిర్వహణకు విదేశీ కంపెనీలను అనుమతించే ప్రతిపాదనేది లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో స్పష్టం చేశారు. రిటైల్ రంగం వృద్ధికి ఆటంకం కలిగించే నియమ నిబంధనలను సరళీకృతం చేసి రిటైల్ వాణిజ్యానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. దుకాణదారులు, రిటైల్ వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్న వారికోసం ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన (పిఎం-ఎల్‌విఎంవై) అనే కొత్త పెన్షన్ పథకానికి కేంద్రం ఆమోదం తెలిపిందని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. రిటైల్ రంగం అభివృద్ధికిగాను జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

ప్రస్తుతం రిటైల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై పరిశ్రమలు, వాణిజ్య సంఘాలు, సంబంధిత కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుగుతోందని, ఈ చర్చల్లో భాగంగా రిటైల్ రంగంలో తీసుకురావాల్సిన మార్పులపై ఎన్నో విలువైన సలహాలు, సూచనలు అందించారని అన్నారు. జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానున్నామని అన్నారు. ప్రధానమంత్రి లఘు వ్యాపారి మాన్‌ధన్ యోజన (పిఎం-ఎల్‌విఎంవై) 18 నుంచి 40 ఏళ్ల వయసు వారికి వర్తిస్తుందని, దీనిలో ఎవరికి తోచినంత వారు జమచేయొచ్చని, వారు జమచేసిన దానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కలుపుతుందని ఆయన వివరించారు. వార్షిక టర్నోవర్ రూ. 1.5 కోట్లకు తక్కువగా ఉండి జిఎస్‌జిఎన్‌లో నమోదు చేసుకున్నవారు, పన్నుల పరిధిలోకి రానివారు, ఇపిఎఫ్‌ఒ, ఇఎస్‌ఐసి, ఎన్‌పిఎస్‌లో నమోదు కానివారు ఈ పెన్షన్ పథకానికి అర్హులని తెలిపారు.

No plans to allow multi brand retail

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మల్టీ బ్రాండ్ రిటైల్‌కు అనుమతివ్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: