24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి విడతలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీలలో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రాలలో ఈ నెల 26న ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. […] The post 24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ విడుదల చేశారు. మొదటి విడతలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాని విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీలలో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. విద్యార్థులు ఎంపిక చేసుకున్న సహాయ కేంద్రాలలో ఈ నెల 26న ధృవపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 29వ తేదీన ఇంజనీరింగ్, పార్మసీ సీట్లు కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలి. అలాగే ఈ నెల 31వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాలి. ఇతర వివరాల కోసం www.tseamcet.nic.in వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.

TS EAMCET last web counselling from July 24th

The post 24 నుంచి ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: