అటువంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా…

  హీరోయిన్ అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ‘ఆమె’. తమిళ్ సినిమా ‘ఆడై’కు తెలుగు వర్షన్ ఇది. భిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అమలాపాల్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు… మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా… ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నేను ఎదగలేను. కథానాయికగా నా […] The post అటువంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హీరోయిన్ అమలాపాల్ నటించిన తొలి థ్రిల్లర్ సినిమా ‘ఆమె’. తమిళ్ సినిమా ‘ఆడై’కు తెలుగు వర్షన్ ఇది. భిన్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రత్నకుమార్. చరిత్ర చిత్ర ప్రొడక్షన్స్ సంస్థలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో శుక్రవారం విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అమలాపాల్ విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా…
ఒకే తరహా పాత్రలు చేస్తే నటిగా నేను ఎదగలేను. కథానాయికగా నా పాత్ర కొత్తగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కొత్తదనం ఉన్న సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

స్పెషల్ మూవీ…
‘ఆమె’ చిత్రంలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ కథ వినగానే వెంటనే సినిమా చేయాలనిపించింది. నా కెరీర్‌లో ఈ చిత్రం స్పెషల్ మూవీగా నిలుస్తుంది.

అందుకే నగ్నంగా నటించా…
సినిమాలో కథ డిమాండ్ మేరకు ఓ సన్నివేశంలో నగ్నంగా నటించాల్సి వచ్చింది. ఈ సన్నివేశం ప్రాధాన్యత గురించి దర్శకుడు చెప్పిన తర్వాత ఆవిధంగా నటించాను. నటిగా నాకు ఈ సినిమా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

అలాంటి సినిమాలు చేయాలని ఉంది…
నయనతార, సమంతలకు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. వారికి మంచి పాత్రలు, మంచి కథలు వస్తున్నాయి. నాకు కూడా అలాంటి సినిమాలు చేయాలని ఉంది. అటువంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా.

నిర్మాతగా ఓ చిత్రం…
నిర్మాతగా తెలుగు, తమిళ్ భాషల్లో ఓ సినిమాను రూపొందిస్తున్నాను. కథ కొత్తగా ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే దర్శకత్వం చేయాలన్న ఆలోచన లేదు.

Aame is the first thriller Movie to Amala Paul

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అటువంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: