హైకోర్టులో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు ఊరట

 హైదరాబాద్‌ : తెలుగు స్టార్‌ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తాము చెప్పే వరకు బిగ్‌బాస్‌-3 నిర్వాహకులను అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమపైన నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బిగ్‌బాస్‌-3 నిర్వాహకులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం […] The post హైకోర్టులో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 హైదరాబాద్‌ : తెలుగు స్టార్‌ మా టీవీ రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తాము చెప్పే వరకు బిగ్‌బాస్‌-3 నిర్వాహకులను అరెస్టు చేయవద్దని హైకోర్టు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బిగ్‌బాస్‌-3 నిర్వాహకులపై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమపైన నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ బిగ్‌బాస్‌-3 నిర్వాహకులు మంగళవారం కోర్టులో పిటిషన్ వేశారు. వీరి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు బిగ్ బాస్-3 నిర్వాహకులను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.

Relief To Bigg Boss-3 Organizers in High Court

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైకోర్టులో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులకు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: