నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలను పూర్తి చేయండి : కెసిఆర్

హైదరాబాద్‌ : టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాలను నిబంధనలు ఉల్లంఘించకుండా పూర్తి చేయాలని ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నేతలకు సూచించారు. వచ్చే దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు కెసిఆర్ […] The post నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలను పూర్తి చేయండి : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : టిఆర్ఎస్ జిల్లా కార్యాలయాల నిర్మాణాలను నిబంధనలు ఉల్లంఘించకుండా పూర్తి చేయాలని ఆ పార్టీ అధినేత, సిఎం కెసిఆర్ నేతలకు సూచించారు. వచ్చే దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. బుధవారం తెలంగాణ భవన్ లో ఆయన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 29 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు కెసిఆర్ చెక్కులు అందించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను ఆయన అందించారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న టిఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి ఇంటిలో ఒకరు పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూసి టిఆర్ఎస్ ను తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మార్చాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామ కమిటీలను కూడా ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.  ఈ భేటీలో పోడు భూముల సమస్యపై కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వరరావు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పోడు రైతులను అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని ఆయన కెసిఆర్ కు చెప్పారు. దీనిపై కెసిఆర్ స్పందించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన వనమాకు హామీ ఇచ్చారు. వచ్చే మున్సపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏకపక్షంగా గెలిచేలా పని చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అసెంబ్లీ, పంచాయతీ, పరిషత్ ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో పునరావృతం కావాలని ఆయన పేర్కొన్నారు.

KCR Meeting With TRS Leaders At Telangana Bhavan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలను పూర్తి చేయండి : కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: