ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయం

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు బుధవారం తాత్కాలికంగా తెరదించింది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అధికారం కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రమే ఉందని, దీనిపై నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించలేమని బుధవారం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా గురువారం జరగనున్న విశ్వాస పరీక్షలో పాల్గొనే నిర్ణయాన్ని సంబంధిత ఎమ్మెల్యేలకే వదిలిపెడుతున్నట్లు కూడా సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం […] The post ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి సుప్రీంకోర్టు బుధవారం తాత్కాలికంగా తెరదించింది. అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అధికారం కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రమే ఉందని, దీనిపై నిర్ణీత కాలవ్యవధిని నిర్దేశించలేమని బుధవారం జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అదే విధంగా గురువారం జరగనున్న విశ్వాస పరీక్షలో పాల్గొనే నిర్ణయాన్ని సంబంధిత ఎమ్మెల్యేలకే వదిలిపెడుతున్నట్లు కూడా సుప్రీంకోర్టు తెలిపింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. జూలై 7ప 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్‌కు సమర్పించిన విషయం తెలిసిందే. వీరి నిర్ణయంతో కర్నాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది.

Speaker is free to take decision on Resignations, SC passes interim orders on Karnataka rebel MLAs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌దే తుది నిర్ణయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: