రాహుల్‌తో గొడవలున్నా వాటాలు అమ్మను…

  ఇండిగో ప్రమోటర్ గంగ్వాల్ న్యూఢిల్లీ: ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ తాజా గొడవలపై స్పందించారు. కంపెనీలో తన భాగస్వామి రాహుల్ భాటియాతో వైరం ఉన్నప్పటికీ ఇండిగో సంస్థలో తన వాటాలను విక్రయించబోనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను సుదీర్ఘ కాలంగా ఇక్కడ ఉంటున్నాను’ అని ఆయన అన్నారు. ఇండిగో భాగస్వామి భాటియా కార్పొరేట్ పాలన లోపాలకు పాల్పడుతున్నారని గంగ్వాల్ ఆరోపించడంతో కంపెనీ పరిస్థితి ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గొడవ వల్ల […] The post రాహుల్‌తో గొడవలున్నా వాటాలు అమ్మను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఇండిగో ప్రమోటర్ గంగ్వాల్

న్యూఢిల్లీ: ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ తాజా గొడవలపై స్పందించారు. కంపెనీలో తన భాగస్వామి రాహుల్ భాటియాతో వైరం ఉన్నప్పటికీ ఇండిగో సంస్థలో తన వాటాలను విక్రయించబోనని ఆయన స్పష్టం చేశారు. ‘నేను సుదీర్ఘ కాలంగా ఇక్కడ ఉంటున్నాను’ అని ఆయన అన్నారు. ఇండిగో భాగస్వామి భాటియా కార్పొరేట్ పాలన లోపాలకు పాల్పడుతున్నారని గంగ్వాల్ ఆరోపించడంతో కంపెనీ పరిస్థితి ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య గొడవ వల్ల షేరు విలువ పతనమవుతూ వస్తోంది. అయితే తాజాగా గంగ్వాల్ తన వాటాల విషయంపై మాట్లాడారు.

‘నాకు వాటాలను విక్రయించాలనే లేదా పెంచుకోవాలనే కోరిక లేదు’ అని అన్నారు. 2005 సంవత్సరంలో ఇండిగోను నెలకొల్పేందుకు విమాన సంస్థ మాజీ సేల్స్ ఏజెంట్ భాటియాతో గంగ్వాల్ జతకట్టారు. ఈ సంస్థ వేగంగా ప్రత్యర్థి కంపెనీలతో పోటీపడి దేశంలో సగం మార్కెట్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ ఇద్దరు వ్యవస్థాపకులు బిలియనీర్లుగా మారారు. యుఎస్ ఎయిర్‌వేస్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన గంగ్వాల్‌కు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(దీని అనుబంధ సంస్థ ఇండిగో)లో 37 శాతం వాటాలు ఉండగా, ఆయన కంపెనీ భాగస్వామి భాటియాకు కొంత ఎక్కువగా 38 శాతం వాటా ఉంది.

అయితే ఈక్విటీలో 38 శాతం వాటాలతో బాటియాకు చెందిన ఐజిఇ గ్రూప్.. ఇండిగో ఎండి, సిఇఒ, ప్రెసిడెంట్‌తో పాటు ఆరుగురు డైరెక్టర్లలో ముగ్గురిని నియమించే అధికారం చలాయిస్తోందని గంగ్వాల్ ఆరోపించారు. కంపెనీ బోర్డు మొత్తాన్ని తన వాళ్లతో నింపి, కంపెనీ నిర్వహణలో ఏ మాత్రం పారదర్శకత లేకుండా ‘కిళ్లీ కొట్టు’ కంటే హీనంగా మార్చేశారని గంగ్వాల్ అన్నారు.

దీనికి తోడు ఇండిగో కొనుగోళ్లలోనూ పలు అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై దర్యాప్తు జరపాలని సెబీకి ఏకంగా లేఖ రాశారు. భాటియా నిర్వహణలోని ఐజీఈ గ్రూపు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తోంది. కంపెనీ ప్రారంభం నుంచి వాటాదారుల మధ్య ఉన్న ఒప్పందం నియమాల ప్రకారమే, కంపెనీ నిర్వహణ జరుగుతోందని తెలిపింది. ప్రమోటర్ల గొడవ నేపథ్యంలో ఇండిగోపై దర్యాప్తు చేయాలని సెబీ, కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 

Rakesh Gangwal said I dont sell Indigo Shares

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాహుల్‌తో గొడవలున్నా వాటాలు అమ్మను… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: