భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు…

  విశ్వ నటుడు కమల్‌హాసన్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఓ భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నట్టు ట్విట్టర్ వేదికగా వారు తెలియజేశారు. రెహమాన్ నివాసంలో కలిసిన ఈ ఇద్దరు ప్రముఖులు ఈ విషయాన్నీ ధృవీకరించడం జరిగింది. ‘తలైవన్ ఇరుకిండ్రాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని […] The post భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విశ్వ నటుడు కమల్‌హాసన్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కలిసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఓ భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు కానున్నట్టు ట్విట్టర్ వేదికగా వారు తెలియజేశారు. రెహమాన్ నివాసంలో కలిసిన ఈ ఇద్దరు ప్రముఖులు ఈ విషయాన్నీ ధృవీకరించడం జరిగింది. ‘తలైవన్ ఇరుకిండ్రాన్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ మూవీ చిత్రీకరణను సెప్టెంబర్‌లో ప్రారంభించనున్నారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి 2020 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్రానికి సంబధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా ప్రకటించలేదు. కమల్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయి. అయితే కమల్ ఈ చిత్రంలో హీరోగా చేస్తారా లేదా కేవలం నిర్మాతగానే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

Kamal haasan and AR Rahman Partners in Filmmaking

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారీ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.