19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్…

  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్‌లైన్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దక్షిణాదిన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ. ఈనెల 26న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ […] The post 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ‘ఫైట్ ఫర్ వాట్ యు లవ్’ అనేది ట్యాగ్‌లైన్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో దక్షిణాదిన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు విజయ్ దేవరకొండ. ఈనెల 26న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “ఇటీవల దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ట్రైలర్‌ను విడుదల చేశాం. కంటెంట్, ఇంటెన్సిటీ, లవ్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందని తెలియజేసేలా ట్రైలర్‌ను విడుదల చేశాం.

అలాగే ఈ ట్రైలర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. ఈ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటివరకు ట్రైలర్‌కు 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈనెల 12న బెంగుళూర్, 13న కొచ్చిలో జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి.

ఇక ఈనెల 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నాం. అలాగే ఈ సినిమాను ఈనెల 26న దక్షిణాది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః సుజిత్ సారంగ్, మ్యూజిక్‌ః జస్టిన్ ప్రభాకరన్, ఎడిటింగ్, డిఐః శ్రీజిత్ సారంగ్, డైలాగ్స్‌ః జె.కృష్ణ, సాహిత్యంః చైతన్య ప్రసాద్, రహమాన్, కృష్ణకాంత్, యాక్షన్ డైరెక్టర్‌ః జి.మురళి, కొరియోగ్రాఫర్‌ః దినేష్ మాస్టర్.

Dear Comrade Musical Festival at Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 19న హైదరాబాద్‌లో మ్యూజికల్ ఫెస్టివల్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: