కలుషిత ఆహారం తిని విద్యార్థ్దులకు అస్వస్థత…

  సికింద్రాబాద్ : గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని విద్యార్థ్దులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేనప్పటికి అందుకు కారకులైన నిర్వాహకులపై విద్యార్థ్దుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. వివరాల్లోకెళితే గోపాలపురం వసతి గృహంలో నివాసం ఉంటున్న పిల్లలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకం ద్వారా 50 మంది విద్యార్ద్థులు సికింద్రాబాద్‌లోని వైఎంసిఎ హాలులో శిక్షణ […] The post కలుషిత ఆహారం తిని విద్యార్థ్దులకు అస్వస్థత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సికింద్రాబాద్ : గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అపశ్రుతి చోటు చేసుకుంది. కలుషిత ఆహారం తిని విద్యార్థ్దులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న నిర్వాహకులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం లేనప్పటికి అందుకు కారకులైన నిర్వాహకులపై విద్యార్థ్దుల తల్లిదండ్రులు మండి పడుతున్నారు. వివరాల్లోకెళితే గోపాలపురం వసతి గృహంలో నివాసం ఉంటున్న పిల్లలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన పథకం ద్వారా 50 మంది విద్యార్ద్థులు సికింద్రాబాద్‌లోని వైఎంసిఎ హాలులో శిక్షణ పొందుతున్నారు.

స్కిల్‌బ్లూ సంస్థ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఉచిత భోజన , వసతి సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం శిక్షణ తరగుతులకు హజరైన విద్యార్థ్దులు మధ్యాహ్నం భోజనం చేశారు. గంట తరువాత దాదాపు ఇరవై మంది విద్యార్థ్దులు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. పరిస్థితిని గమనించిన నిర్వాహకులు ఎనిమిది మందిని చికిత్స కోసం గాంధీ ఆసుత్రికి తరలించారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థ్దులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం మూలంగానే విద్యార్థ్దులు అస్వస్థతకు గురయినట్టు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.

Students became ill by eating contaminated food

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కలుషిత ఆహారం తిని విద్యార్థ్దులకు అస్వస్థత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.