జిఎంఆర్‌విఎఫ్‌కు ఎఫ్‌టిసిసిఐ ఎక్స్‌లెన్స్ అవార్డు

  మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) విభాగమైన జిఎంఆర్‌విఎఫ్ (జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్) ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు గాను ప్రతిష్టాత్మక ఎఫ్‌టిసిసిఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. జులై 12న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆ పురస్కారాన్ని అందజేశారు. కార్పొరేట్ సోషల్ […] The post జిఎంఆర్‌విఎఫ్‌కు ఎఫ్‌టిసిసిఐ ఎక్స్‌లెన్స్ అవార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మన తెలంగాణ/ హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్‌ఆర్) విభాగమైన జిఎంఆర్‌విఎఫ్ (జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్) ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు గాను ప్రతిష్టాత్మక ఎఫ్‌టిసిసిఐ (ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) ఎక్సలెన్స్ అవార్డును అందుకుంది. జులై 12న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఇతర ప్రముఖుల సమక్షంలో ఆ పురస్కారాన్ని అందజేశారు.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూపంలో ఎయిర్ పోర్టు, దాని పరిసర ప్రాంతాలలో పని చేస్తూ అక్కడి ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పు తీసుకువస్తున్న జిహెచ్‌ఐఎఎల్ కృషిని ఎఫ్‌టిసిసిఐ అభినందించింది. ప్రతిష్టాత్మక ఎఫ్‌టిసిసిఐ పురస్కారాన్ని గెల్చుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, స్థానిక ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి ఈ అవార్డు ప్రేరణ కలిగిస్తుందని జిహెచ్‌ఐఎఎల్ సిఇఒ ఎస్.జి.కె కిషోర్ అన్నారు.

FTCCI Excellence Award for GMRVF

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జిఎంఆర్‌విఎఫ్‌కు ఎఫ్‌టిసిసిఐ ఎక్స్‌లెన్స్ అవార్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.