ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు…. తల్లి ఆత్మహత్య

  ఖమ్మం: నగరంలో ఓ గృహిణి కుటుంబ కలహాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం పట్టణంలో బైపాస్ రోడ్డులో గల శ్రీమంత ఆపార్ట్‌మెంట్‌లో గ్రానైట్ వ్యాపారి వేముల రవికుమార్ భార్య వేముల వాణి (40) కూతురు, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎంబిబిఎస్ చదివే కన్న కూతురు ప్రేమించి పెండ్లి చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోవటంతో కుటుంబంలో నెల రోజులుగా చోటు చేసుకుంటున్న కలహలతో విసుగు చెందిన మృత్యురాలు […] The post ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు…. తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఖమ్మం: నగరంలో ఓ గృహిణి కుటుంబ కలహాలతో సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళ్తే… ఖమ్మం పట్టణంలో బైపాస్ రోడ్డులో గల శ్రీమంత ఆపార్ట్‌మెంట్‌లో గ్రానైట్ వ్యాపారి వేముల రవికుమార్ భార్య వేముల వాణి (40) కూతురు, కొడుకుతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎంబిబిఎస్ చదివే కన్న కూతురు ప్రేమించి పెండ్లి చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోవటంతో కుటుంబంలో నెల రోజులుగా చోటు చేసుకుంటున్న కలహలతో విసుగు చెందిన మృత్యురాలు (వాణి) అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తన కూతురును ఎలాగైనా డాక్టర్‌ను చేయాలనే ఉద్ధేశ్యంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎంబిబిఎస్ చదివిస్తుంటే ఆ కూతురే ప్రేమ పెండ్లి వైపు వెళ్తుందనే అవమానంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని బంధువులు చర్చించుకోవటం గమనార్హం. ప్రేమించటం తప్పు కాకపోయినప్పటికీ యువతులు చేసే తప్పిదాల వలన తల్లిదండ్రల పరిస్థితి ఇలా మారుతుందని, ఎవరూ ఊహించి ఉండరని వారి బంధువులు చర్చించుకుంటున్నారు. యువత తొందరపాటు నిర్ణయాల వల్ల వారి జీవితంతో పాటు తల్లిదండ్రుల జీవితాలు కూడా సమాజంలో దెబ్బ తింటాయనటానికి ఈ ఆత్మహత్య సంఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు అందరు సంతోషంగా ఉన్న అ కుటుంబంలో ఒకేసారి విషాదఛాయలు అలుముకోవటంతో మృతురాలి భర్త వేములు రవికుమార్, కుమారుడు విలపిస్తున్న తీరు అందరిని కంట తడి పెట్టించింది. వాణి భౌతికకాయానికి పోస్టుమార్టం నిర్వహించి బందువులకు అప్పగించారు. ఆమె అంత్యక్రియలు నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించనున్నారు.

Mother Committed suicide with family problems

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రియుడితో వెళ్లిపోయిన కూతురు…. తల్లి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: