రమణీయ రత్నావళి

  రమణీయ రత్నావళి శతకం 120 పద్యాలతో కూర్చబడిన పుస్తకం. ఇందులో పద్యాలు అన్నీ ఆటవెలదిలో కూర్చబడినవి. ఆటవెలది పద్యాలకు ప్రజాకవి యోగి వేమన వేమన శతకం ఎంతటి ప్రజాదరణ పొందినదో అలాంటి నీతిని నైతిక విలువలను పెంపొందింపజేయడానికి కవి నల్లు రమేష్ ఆటవెలదిలో శతక పద్యాలను రచించడం జరిగింది. రమణీయ రత్నావళి శతకం చదువుతున్నప్పుడు నేడు సమాజంలో జరుగుతున్న దురాచారాలు, అనైతిక విషయాలకు మనం ఎలా దూరంగా ఉండాలో, సమాజంతో ఎలా మెలగాలో అందరికీ అర్థమయ్యే […] The post రమణీయ రత్నావళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రమణీయ రత్నావళి శతకం 120 పద్యాలతో కూర్చబడిన పుస్తకం. ఇందులో పద్యాలు అన్నీ ఆటవెలదిలో కూర్చబడినవి. ఆటవెలది పద్యాలకు ప్రజాకవి యోగి వేమన వేమన శతకం ఎంతటి ప్రజాదరణ పొందినదో అలాంటి నీతిని నైతిక విలువలను పెంపొందింపజేయడానికి కవి నల్లు రమేష్ ఆటవెలదిలో శతక పద్యాలను రచించడం జరిగింది. రమణీయ రత్నావళి శతకం చదువుతున్నప్పుడు నేడు సమాజంలో జరుగుతున్న దురాచారాలు, అనైతిక విషయాలకు మనం ఎలా దూరంగా ఉండాలో, సమాజంతో ఎలా మెలగాలో అందరికీ అర్థమయ్యే సరళ భాషతో, మంచి ఉదాహరణలతో తెలిపారు. ఈ పద్యాలు వేమన పద్యాలు లాగా సరళంగానే ఉంటూ సమాజాన్ని ఉత్తేజపరిచేలాగా ఉన్నాయి. చదువులు వల్ల ఉపయోగాలు చదువు ఎలా చదవాలో ఉదాహరణలతో తెలిపారు.

‘కలహమున్న ఇంట కాపురం కష్టమే’ అంటూ కాపురం ఎలా ఉండాలో, వరకట్నం తీసుకున్న వరుడు దేనితో సమానమో ఇలా చాలా విషయాలు తెలియజేశారు. గెలుపు ఓటములు గురించి అవి ఎలా వస్తాయి అను విషయాలను సరళమైన మాటలతో వివరించడం, అదే విధంగా మరుగుదొడ్ల వినియోగం గురించి చక్కగా పద్యాలలో వివరించారు. ‘అద్దె గర్భ శిశువు ఆధునిక యుగం నీతిని మరిచి పోతుందని’ సమాజాన్ని హెచ్చరించారు. ‘ధనం మీద మోజు పెంచుకోవద్దు’ అంటూ కవి నల్లు రమేష్ యువతను సున్నితంగా హెచ్చరించారు. ‘కండబలం తోటి కదల వద్దు బుద్ధి బలము ముందు బూడిద అయిపోవు’ అంటూ కవి బుద్ధి బలాన్ని ఉపయోగించాలని హితవు పలకడం బాగుంటుంది. ‘విలువ మాట నేర్పు వినర బాల!’ అంటూ నేటి బాలలకు, అందరికీ చాలా విలువైన మాటలను సమాజానికి ఆనాటి వేమన లాగా పండిత పామరులకు కూడ అర్థమయ్యే భాషలో అందించారు.

అదేవిధంగా శ్రమ విలువ పైన, విద్య ఆవశ్యకత పైన, తల్లిదండ్రులను గౌరవించాలనే అంశంమీద, మంచి మాట పైన, మాతృభాషపై, పేదరికం, లంచం, భ్రూణ హత్యలు లాంటి సామాజిక రుగ్మతల పైన ఇందులో పద్యాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ముఖ్య పాత్ర వహిస్తున్న ఆత్మగౌరవం లాంటి అంశాలను తీసుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో కవి నల్లు రమేష్ పద్యాలు రాశారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని, జంతు బలులను ఆపాలని, మూఢనమ్మకాలను తొలగించాలని రాసిన పద్యాలు నార్లవారిని గుర్తుకు తెచ్చే విధంగా ఉన్నాయి. ఈ పద్యాలలోని మూడవ పాదం మనసుకు హత్తుకుపోయేలా ఉంటుంది. ఈ వచన కవిత్వంలో కొసమెరుపు క్షణంలో ఆయన రచించిన పద్యాలు మూడవ పాదం అందర్నీ మెప్పించడమే కాకుండా మనసులను మెరిపిస్తుంది. ఆణిముత్యాల్లాంటి పద్యాలలో కొన్ని గమనిద్దాం.

‘అపజయాలు కలుగ ఆందోళన పడకు
ఆత్మశక్తి వీడి అదిరిపడకు
నిశను దాటితేనే నీకు పున్నమి కలుగు
విలువ నేర్పు మాట వినర బాల!’

ఓటమి ఎదురైనప్పుడు దిగులు పడక ఓరిమి తో ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం నిన్ను వరిస్తుంది అని తెలిపిన స్ఫూర్తిదాయక పద్యం ఇది.
విందు భోజనాలు విలువైన కార్యాలు
వెలకు మించి ఖర్చు వేల వేలు
విందు వ్యర్ధమైన వినుము పేదల బాధ
విలువ నేర్పు మాట వినర బాల!

నేడు జరుగుతున్న వివాహ వేడుకల్లో పలు రకాల వంటకాలలో ఆడంబరంగా విందు భోజనాల పేర ఎంతో వ్యర్ధం చేస్తున్నారు. అలా చేయక ఆకలితో అలమటించే పేదలను గుర్తుంచుకుంటే మంచిదని చక్కటి పద్యాలలో చెప్పారు.
‘మనసు లేక చదువు మరిమరి చదివిన
అలుపు తప్ప గెలుపు మలుపు రాదు
గురిలేని శరము గుప్పించ నేటికి
విలువ నేర్పు మాట వినర బాల!’
ఈ పద్యంలో మనసు పెట్టి చదవని చదువు గురి చూడక ఎక్కు పెట్టిన బాణం లాంటిది అని విద్యార్థులకు హితవు చెబుతాడు కవి.

‘అద్దె గర్భ శిశువు అందుకున్న యుగం
మేలు సృష్టి చేయు మేటి యుగం
నీతి ఉట్టి మరచి నింగికెగర నేల?
విలువ నేర్పు మాట వినర బాల!’

ఈ పద్యంలో శారీరక కలయిక లేకుండానే అద్దె గర్భాలతో పిల్లలను పుట్టిస్తున్నాము. అన్ని రంగాలలో మేలు రకాలను వృద్ధి చేస్తున్నాము కానీ నీతి ఉట్టిని అందుకోకుండానే ఆకాశానికి ఎగరడంలో ఆంతర్యమేమిటని కవి ప్రశ్నిస్తున్నాడు.
‘కొడుకు ముఖ్య మనుచు కోరింది ఇచ్చేరు
కూతురన్న చాలు కుమిలి ఏడ్చు
కీర్తి పెంచడానికెందుకీ భేదము
విలువ నేర్పు మాట వినర బాల!’

ఈ పద్యంలో కొడుకులే ముఖ్యమని కోరిన చదువులు చదివిస్తారు. కూతురు అనగానే భారమని కుమిలి కుమిలి ఏడుస్తారు. కానీ కీర్తి పెంచేవారికి ఈ భేదము వర్తించదు అని నేటి సమాజంలో ఉన్న దుస్థితిని మన కళ్ళకు కడుతాడు కవి. శతకాలు చాలా ఉన్నప్పటికీ అడుగడుగునా సమాజ హితాన్ని కాంక్షిస్తూ పిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ విలువలు పెంపొందించడంలో ముఖ్య భూమిక పోషించే విధంగా కవి రమణీయ రత్నావళిని తీర్చి దిద్దాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Ramaneeya Ratnavali satakam is 120 words book

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రమణీయ రత్నావళి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: