ఆదాయం పన్ను కథాకమామిషు..

  న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన అనంతరం ఆదాయం పన్నుల్లో ఎలాంటి మార్పులు చేసింది, వాటిలో ప్రయోజనాలెన్ని ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో ఆదాయం పన్నుపై మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్ మార్పు మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారులను నిరాశపర్చింది. మధ్యంతర బడ్జెట్‌లో ఇప్పటికే పెద్ద మార్పులు ప్రకటించినందున పూర్తి బడ్జెట్ ప్రతిపాదనలో కొన్ని మార్పులు మాత్రమే చేశారు. ఆదాయపు పన్ను శ్లాబ్ ఏడాదికి రూ […] The post ఆదాయం పన్ను కథాకమామిషు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన అనంతరం ఆదాయం పన్నుల్లో ఎలాంటి మార్పులు చేసింది, వాటిలో ప్రయోజనాలెన్ని ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బడ్జెట్‌లో ఆదాయం పన్నుపై మధ్యతరగతి ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను శ్లాబ్ మార్పు మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారులను నిరాశపర్చింది. మధ్యంతర బడ్జెట్‌లో ఇప్పటికే పెద్ద మార్పులు ప్రకటించినందున పూర్తి బడ్జెట్ ప్రతిపాదనలో కొన్ని మార్పులు మాత్రమే చేశారు.

ఆదాయపు పన్ను శ్లాబ్
ఏడాదికి రూ .5 లక్షల వరకు ఆదాయం సంపాదించే వ్యక్తులు మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పు లేదు. ఇంతకుముందు సెక్షన్ 87ఎ ప్రయోజనం రూ .2500 ఉండగా, ఇప్పుడు రూ .12500 కు పెంచారు. అంటే మీ ఆదాయం 5 లక్షల వరకు ఉంటే మీరు సెక్షన్ 87 ఎ ను ఉపయోగించుకోవచ్చు. అలాగే రూ.5 లక్షల వరకు పన్ను రహిత ఆదాయాన్ని పొందవచ్చు. రూ.2 కోట్లకు పైగా, రూ.5 కోట్ల లోపు సంపాదించే వ్యక్తులు అధిక ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విభాగానికి సర్‌చార్జి పెరిగింది.

రూ.2 కోట్లకు పైగా, 5 కోట్ల రూపాయల లోపు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఉన్నవారికి ఆదాయపు పన్నుపై సర్‌చార్జిని 25 శాతానికి పెంచాలని బడ్జెట్ ప్రతిపాదించింది. రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 37 శాతం సర్‌చార్జి చెల్లించాలి. సర్‌చార్జి పెరుగుదలతో, సూపర్ రిచ్ (సంవత్సరానికి 5 కోట్ల రూపాయలకు పైగా సంపాదించడం) ఇప్పుడు 42.7 శాతం పన్ను చెల్లించాలి. 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల మధ్య సంపాదించే వారు ఇప్పుడు 25 శాతం సర్‌చార్జి, కావున పన్ను రేటు 39 శాతం ఉంటుంది.

హౌసింగ్‌కు అదనపు పన్ను మినహాయింపు
ఇక నుంచి గృహ రుణ వడ్డీ చెల్లింపుపై రూ.1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. వడ్డీ చెల్లింపుపై ప్రస్తుత ఉన్న రూ.2 లక్షల పన్నుపై ఈ ప్రయోజనం లభిస్తుంది. గృహ రుణ వడ్డీ చెల్లింపు కోసం మీరు 3.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. సెక్షన్ 80 ఇఇ కింద రూ.45 లక్షల వరకు ఆస్తి వ్యయానికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

ఎలక్ట్రానిక్ వాహనాలకు
ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు కోసం తీసుకునే రుణంపై వడ్డీ చెల్లింపు రూ.1.5 లక్షల వరకు కొత్త పన్ను మినహాయింపు ప్రతిపాదించారు. ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని పెంచాలనే లక్షంతోనే ప్రభుత్వం ఈ మినహాయింపును ప్రవేశపెట్టింది. విద్యుత్ వాహనాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. విద్యుత్ వాహనాలపై జిఎస్‌టిని 12 శాతం నుంచి 5 శాతానికి తెచ్చే ఆలోచన ఉందని ఆర్థికమంత్రి తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం జిఎస్‌టి మండలి పరిశీలనలో ఉందన్నారు.

ఇఎల్‌ఎస్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా సిపిఎస్‌ఇ ఇటిఎఫ్
కేంద్ర త్వరలో కొత్త ప్రభుత్వరంగ సంస్థ ఇటిఎఫ్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ సిపిఎస్‌ఇ ఇటిఎఫ్.. ఇఎల్‌ఎస్‌ఎస్ పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి ఎంపిక చేసిన ప్రభుత్వరంగ కంపెనీల్లో వాటాలను ఉపసంహరణ ప్రక్రియను కేంద్రం చేపడుతుంది.

విత్‌డ్రాపై 2 శాతం టిడిఎస్
బ్యాంకు ఖాతా నుంచి ఏడాదిలో 1 కోటి రూపాయలకు పైన నగదు ఉపసంహరణ చేసే 2 శాతం టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే అత్యంత ధనవంతులకు నగదు ఉపసంహరణ కష్టమవుతుంది. -రూ. 50 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగిన సంస్థలలో భీమ్, యూపిఐ, నెఫ్ట్, ఆధార్ పే తదితర మార్గాలలో చేపట్టే కస్టమర్ల చెల్లింపులపై ఎలాంటి చార్జీల విధింపు ఉండబోదు.

ప్రి ఫిల్డ్ ఐటిఆర్ ఫారంలు
ప్రి ఫిల్డ్ ఐటిఆర్ ఫారంలు త్వరలో వాస్తవరూపం దాల్చనున్నాయి. పన్ను చెల్లింపుదారుడు జీతం ఆదాయం, ఎఫ్‌డిపై వడ్డీ ఆదాయం, సెక్యూరిటీల నుంచి మూలధన లాభం, డివిడెండ్ ఆదాయం మొదలైనవాటికి ముందే నింపిన ఐటిఆర్ పొందుతారు. ఈ వివరాలు బ్యాంక్, స్టాక్ ఎక్స్ఛేంజ్, ఫారం 26 ఎఎస్ నుంచి సేకరిస్తారు. ఇది ఐటిఆర్ దాఖలు చేయడానికి అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. ఐటిఆర్ ఫారమ్‌ను దాఖలు చేసేటప్పుడు తప్పులు తగ్గించడానికి ఇది దోహదపడుతుంది.

పాన్‌కు బదులుగా ఆధార్
పాన్, ఆధార్ ఇప్పుడు వీటిలో ఏదైనా ఒకటి ఐటిఆర్ దాఖలు చేయడానికి ఉపయోగించవచ్చు. అంటే పాన్ కార్డు లేని ఏ పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఆధార్‌ను వినియోగించవచ్చు.

ఫేస్‌లెస్ ఆదాయపు పన్ను అంచనా
పన్ను చెల్లింపుదారుల వేధింపులను తగ్గించడానికి, ఈ సంవత్సరం దశలవారీగా ప్రత్యక్షంగా ఎదుర్కోకుండా ఎలక్ట్రానిక్ విధానంలో ఫేస్‌లెస్ ఆదాయపు పన్ను అంచనా అమలు చేయనున్నారు. ఫేస్‌లెస్ అంచనా లక్ష్యం పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను అధికారి మధ్య ప్రత్యక్షంగా హాజరు లేకుండా చేయడమే. ఈ అంచనా, పరిశీలనతో అంచనా వేసే అధికారికి పన్ను చెల్లింపుదారుడి గుర్తింపు తెలియదు. పన్ను చెల్లింపుదారుడి వివరాలను పరిశీలించడానికి సాంకేతికత విధానాన్ని వినియోగిస్తారు.

రూ.8 లక్షల వరకు మినహాయింపు
పన్ను చెల్లింపుదారుడు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.8 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అదెలా అంటే కింద వివరాలను పరిశీలించండి.
80సి పన్ను ప్రయోజనాలు -(1.5 లక్షలు)
గృహ రుణ వడ్డీ – (3.5 లక్షలు)
స్టాండర్డ్ డిడక్షన్ – (0.5 లక్ష)
ఎన్‌పిఎస్ పెట్టుబడి – (0.5 లక్ష)
ఆరోగ్య బీమా (0.25 లక్ష)
ఆరోగ్య బీమా తల్లిదండ్రులు – (0.30 లక్ష)
ఎలక్ట్రికల్ వెహికల్ లోన్ వడ్డీ – (1.5 లక్షలు)

Some changes in the budget proposal

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదాయం పన్ను కథాకమామిషు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: