లక్షసాధనలో బిడియమెందుకు?

  “నీకు జాబ్ రాకపోవటం ఏమిటీ? నీకున్న అర్హతలు ఆ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకిలా?” “ఏమో ఇంటర్వూలో పాడు చేశాను. మాట్లాడలేక పో యాను. ఒక బిడియం నా చిన్నప్పటి నుంచి నోరెత్త నీయదు.” “క్లాసులో నీకు అన్ని వచ్చి కూడా సమాధానం చెప్పకుండా నిలబడతావేం?” “నాకు మాట్లాడాలంటే సిగ్గు.” “తప్పు నీదే కదరా? ఎంత బాధ పడ్డావు మరి! సారీ చెప్పలేకపోయావా?” “నాకు సిగ్గు” ఇదిగో ఇదే సమస్య ఎంత మందిలో. నోరు విప్పి […] The post లక్షసాధనలో బిడియమెందుకు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

“నీకు జాబ్ రాకపోవటం ఏమిటీ? నీకున్న అర్హతలు ఆ ఉద్యోగానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకిలా?”
“ఏమో ఇంటర్వూలో పాడు చేశాను. మాట్లాడలేక పో యాను. ఒక బిడియం నా చిన్నప్పటి నుంచి నోరెత్త నీయదు.”
“క్లాసులో నీకు అన్ని వచ్చి కూడా సమాధానం చెప్పకుండా నిలబడతావేం?”
“నాకు మాట్లాడాలంటే సిగ్గు.”
“తప్పు నీదే కదరా? ఎంత బాధ పడ్డావు మరి! సారీ చెప్పలేకపోయావా?”
“నాకు సిగ్గు”

ఇదిగో ఇదే సమస్య ఎంత మందిలో. నోరు విప్పి మాట్లాడలేను. తలెత్తి కళ్లలోకి చూడలేరు. తగని సిగ్గుతో ఎప్పుడూ వెనకే నిలబడిపోతారు. ఇలా సిగ్గు, బిడియం అనే భూతా న్ని వదిలేయకపోతే భవిష్యత్తు లేకుండా పోతుందని అంటారు నిపుణులు. సిగ్గు పోగొట్టుకోగలిగితేనే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుతారు. దీన్ని పోగొట్టుకునేందుకు కొన్ని ఉపాయాలు పాటించమంటున్నారు నిపుణులు.

ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకరుగా ఉండరు. ఎవరి ప్రవర్తనా శైలి, మాటతీరు, ఆలోచనల స్వభావం అ న్నీ వేర్వేరుగానే ఉంటాయి. దాన్ని ఎదుటివాళ్లకు అర్థం అయ్యేలా చెప్పటం కోసమే భాష ఉపయోగపడుతోంది. ఎదుటి మనిషితో ఒక స్నేహం, బాంధవ్యం పరిచయం వృద్ధి అవ్వాలంటే మనం ఏమిటో అవతల వాళ్ల కు తెలియాలి. ఎదుటివాళ్లలాగా నవ్వలేకపోతామనో, మాట్లాడలేమనో సందేహాలతో, ఆత్మన్యూనతతో మొదట్లో ఈ సిగ్గు మొదలౌతుంది. కానీ ఒక్క విషయం మాత్రం ఎవరికి వాళ్లు తెలుసుకోవాలి.

కొన్ని విషయాలు మాట్లాడేందుకు సిగ్గా? కొన్ని సందర్భాల్లోనా? కొన్ని ఇంటర్వూల్లోనా, తోటి మనుషులతో ఎవ్వరితోనైనా మాట్లాడ లేకపోతున్నామనే విషయాన్ని తెలుసుకుంటే సిగ్గును జయించటం తేలికే. ఒక ఇంటర్వూకి వెళ్లబోయే ముందర, ఎలా డ్రస్సింగ్ స్ట యిల్ ఉండాలో, ఏం మాట్లాడాలో, మన గురించి ఏం చె ప్పుకోవాలో ముందుగా చిన్న ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ విషయాన్ని అయినా సూటిగా, క్లుప్లంగా ఉండేలా ఈ ప్రాక్టీస్ చేయాలి. ఎదుటివాళ్లు ఎంతటి వాళ్లయినా ఎప్పుడూ అనుకరించనక్కర్లేదు. ఎవరికి వాళ్లకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ముఖం అందంగా ఉండచ్చు, మాట చక్కగా ఉండచ్చు, గొంతు శ్రావంగా ఉండచ్చు.

మంచి జుట్టు , మంచి రంగు లేదా చక్కని తెలివైన చూపులు, కళ్లు, చూడగానే సద్భావన కలిగే రూప విశేషాలు ఏవైనా కావచ్చు. నలుపు, తెలుపు, పొడుగు, పొట్టి, రంగు, సిగ్గు రూపంలో సంబంధం అవతల పెడితే, మనకి మన పేరు రూపం సొంతంగా ఉంటాయి. వాటితోనే ఈ ప్ర పంచాన్ని జయించుకురావాలనే కాంక్ష కావాలి.

సిగ్గు ఒక అనారోగ్య లక్షణం అనుకుందాం. దీ న్ని పొగొట్టుకోవడం కోసం కుటుంబ సభ్యుల సహాయ స హకారాలు తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక అరగంట ఇంట్లో వాళ్ల ముందు ఏదో ఒక టాపిక్‌ను మాట్లాడొచ్చు. ప్రశ్నలు అడిగితే సమాధానాలు ఇవ్వచ్చు, ఇది ప్రాక్టీస్ చేయాలి. అ లాగే ఇతరులను శ్రద్ధగా గమనించాలి. మన ఇంట్లో, బయ ట పరిచయస్తులు, సినిమాల్లో వ్యక్తులు అందరూ ఎలా మాట్లాడుతున్నారు, ఒక్క సందర్భాల్లో వాళ్లు మాట్లాడే పద్ధతి, గొంతులో వచ్చే హెచ్చుతగ్గులు, మొహం తీరు మా రటం అన్నీ గమనించాలి. ప్రతిరోజూ ఒక కొత్త వ్యక్తితో మాట్లాడాలి. కనీ సం రైల్వేస్టేషన్, బస్ స్టాండ్‌కు పోయి అక్కడ ఏ ప్రయాణీకులతోనైనా నాలుగు నిమిషాలు మాట్లాడితే చాలు. అపరిచితులతో మాట్లాడే సామాన్య విషయాలు పాలిటిక్స్, ధరలు, స్కూళ్లు ఇలాంటివి ఏవైనా ఎంచుకోవచ్చు.

ఎప్పుడూ మనతోటి వాళ్లతో, తేడా మన కంటే ఒక మెట్టు ఆర్థికంగా, సామాజికంగా ఏ రకంగా అయినా కాస్త ఎత్తుగా ఉన్నవాళ్లతో పోల్చుకోవటం చాలా నష్టం. దం డగ కూడా. మనకి సౌకర్యమైన వాతావరణం, మనకి సౌకర్యంగా అనిపించే మనుషులలోనే మనకి జీవితం బావుంటుంది. జీవితంలో ఎదిగేందుకు పోల్చుకోవద్దు.

ఒకళ్లు అనర్గళంగా మాట్లాడలేక సా మర్థంతో ఉంటే ఆ శక్తి మనకు లేదని పోలిక తెచ్చుకొని కుంగిపోవద్దు. అలా మాట్లాడే సమర్థతలు వేరుగా ఉంటాయి. వాళ్లకి సబెక్ట్ పైన అవగాహన ఉంటుంది. చెప్పే విధానం బోధపడి ఉంటుంది. ముఖ్యంగా బిడియపడే అలవాటు లేకుండా ఉంటారు. అందువల్ల ముందుగా సిగ్గును పోగొట్టుకోవాలి అని మనసులో నిర్ణయించుకుని ప్రాక్టీస్ చేసి, మాట్లాడి, తలెత్తి కళ్లలోకి చూడటం అలవర్చుకుని, నలుగురిలోకి వెళ్లి కూ ర్చుని నెమ్మదిగా దార్లో పడాలి. సిగ్గు తరిమేయటం తేలికే అది స్వభావం అంతే దాన్ని మార్చుకోవచ్చు.

Job Interview Tips and Advice to Make a Great Impression

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లక్షసాధనలో బిడియమెందుకు? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.