నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు

  మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు. దుష్ట శక్తులు దేవతల దరిచేరకుండా పొలిమేర కట్టు పోతురాజుగా భక్తులందరి చేత మొదటగా పూజలందుకునేది పోతురాజు. అందుకే శక్తి దేవతలు ఉన్న ఆలయాల ముందు రాయి రూపంలో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. పోతురాజుకు సంబంధించిన అనేక మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా పోతురాజు విభిన్న ఆశ్రిత […] The post నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు. దుష్ట శక్తులు దేవతల దరిచేరకుండా పొలిమేర కట్టు పోతురాజుగా భక్తులందరి చేత మొదటగా పూజలందుకునేది పోతురాజు. అందుకే శక్తి దేవతలు ఉన్న ఆలయాల ముందు రాయి రూపంలో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. పోతురాజుకు సంబంధించిన అనేక మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా పోతురాజు విభిన్న ఆశ్రిత కళా రూపాల్లో కూడా పోతురాజు ఆహార్యం ప్రత్యేకంగా ఉండడమే కాక గిరిజనుల్లో కూడా పోతురాజును కొలవడం కనిపిస్తుంది.

జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ సందర్భంగా శక్తికి ప్రతిరూపమైన పోతురాజు వేషాలు ఆకట్టుకుంటాయి. ఈ వేషాలు ధరించే కళాకారులు కొందరు వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆనవాయితీని అనుసరిస్తూ వేషం కడతారు. గుడిలోని రాగి పత్రాల మీద వీరి వంశ క్రమం వ్రాయబడి ఉంటుంది. వారే ఆ అమ్మవారి దగ్గర పోతురాజు వేషం వేయాల్సి ఉంటుంది. వీరికి ఆలయం ప్రతిఫలం అందిస్తుంది. అంతే కాకుండా మరికొందరు ఔత్సాహిక కళాకారులు కూడా పోతురాజు వేషం కడతారు. కళాకారులు ఎవరైనా పోతురాజు వేషం ధరించే సందర్భంలో నిష్టగా ఉంటారు. వీరికి అమ్మవారు ఆవహిస్తుంది. ఈ కళాకారులు అలంకరణలో పూర్వం పసుపు, కుంకుమ ప్రధానంగా ఉపయోగించి వేషం ధరించేవారు.

ప్రస్తుతం ఆధునిక ఎనామిల్ రంగులు, రకరకాల పూసల దండలు, చమ్కీలు, గజ్జెల్లాగు ధరించి భక్తులను ఆకర్షించే విధంగా అలంకరించుకుంటున్నారు. చేతిలో పవిత్రమైన ఈరకోల లేదా కొరడా ప్రధానంగా ఉంటుంది. పండుగలో భాగంగా ఊరేగింపులో పోతురాజులు డప్పు చప్పుళ్లకు అడుగులు వేస్తూ, భక్తులను అలరిస్తారు. వారి దగ్గర ఉండే పవిత్రమైన ఈరకోలను దుష్ట శక్తులు ఆవహించిన భక్తులు మెడలో వేయించుకొంటే ఆ శక్తులు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతే కాకుండా దీర్ఘకాలిక రోగాలు ఉంటే తగ్గిపోతాయని నమ్ముతారు. ఆ రకంగా భక్తులు పోతురాజుల చేత ఈరకోలను మెడలో వేయించుకొని తమ మానసిక రుగ్మతలను తొలగించుకుంటారు.

బోనాలు తెలంగాణ సంస్కృతి గొప్పదనాన్ని వైవిధ్యాన్ని తెలియజేస్తాయి. ఈ పండుగలో భాగమైన పోతురాజుల ఆహార్యం, విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తాయి. జానపదుల విశ్వాసం ప్రకారం శివుని అంశతో పుట్టిన పోతురాజు నూటా ఒక్క శక్తి దేవతలకు తోడబుట్టిన తమ్మునిగా ప్రసిద్ధి. మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు. దుష్ట శక్తులు దేవతల దరిచేరకుండా పొలిమేర కట్టు పోతురాజుగా భక్తులందరి చేత మొదటగా పూజలందుకునేది పోతురాజు. అందుకే శక్తి దేవతలు ఉన్న ఆలయాల ముందు రాయి రూపంలో పోతురాజు విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. పోతురాజుకు సంబంధించిన అనేక మౌఖిక కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాకుండా పోతురాజు విభిన్న ఆశ్రిత కళా రూపాల్లో కూడా పోతురాజు ఆహార్యం ప్రత్యేకంగా ఉండడమే కాక గిరిజనుల్లో కూడా పోతురాజును కొలవడం కనిపిస్తుంది. మహాభారత కథలో పోతురాజు: పూర్వం శివలింగ మహారాజు గొప్ప శివ భక్తుడు. అతను ప్రతిరోజు ఈశ్వరుడి పూజ చేసి వస్తూ ఉంటాడు. అతనికి సంతానం లేకపోవడంతో ఒకరోజు సంతానం కోసం శివుని ప్రార్ధిస్తాడు.

అతని భక్తికి మెచ్చిన శివుడు అగ్ని కణాల్లో నుంచి పోతురాజును ప్రసాదిస్తాడు. పోతురాజు తండ్రి ప్రతిరోజు శివుడి వద్దకు పూజ చేయడానికి వెళుతూ ఉండగా ఒక రోజున నేను కూడా వస్తానని తండ్రి వెంట వెళ్తాడు. అక్కడ ఆ తండ్రి పూజ చేస్తున్న సమయంలో పార్వతీ దేవి డమరుకం, జాటి, కత్తి ఎత్తుకొని వస్తాడు. తండ్రి మరుసటి రోజున పోతురాజు వద్దనున్న వస్తువులను చూసి ఆశ్చర్యపోయి ఇవి ఆది శక్తి పార్వతీ దేవికి సంబంధించినవి ఎవరి వద్ద ఉంటే వారు మహా బలవంతులు అవుతారని వారికే జయం కలుగుతుందని వీటిని దొంగిలించడం పాపం అని తిరిగి ఇచ్చేయమని చెప్తాడు .. అందుకు ఆగ్రహించిన పోతురాజు తండ్రి తలని నరుకుతాడు. కన్న తండ్రి అని చూడకుండా నన్నే నరికావు కాబట్టి నీ చేతిలో పట్టుకొని ఉన్న నా తలను ఎప్పుడైతే కింద వేస్తావో అప్పుడే నువ్వు మరణిస్తావని తండ్రి శాపం పెడతాడు.

అప్పటి నుండి పోతురాజు ఎడమ చేతిలో తండ్రి తల, కుడి చేతిలో కత్తి పట్టుకుని ఉంటాడు. ఆనాటి నుండి పోతురాజు అపజయం అంటూ లేకుండా రాజ్యపాలన చేస్తూ గర్వంగా జీవిస్తూ ఉంటాడు. మహాబలవంతుడైన పోతురాజు శివలింగ పట్టణంలో విభూది గడ్డలతో కోట నిర్మించుకొని ఎదురులేని రాజుగా పేరు పొందుతాడు. ఈ సమయంలో పాండవులు ఏకచక్ర పురంలో బ్రాహ్మణ వేషంలో ఉంటారు. ఒకరోజున భీముడు బండ్ల కట్టెలను ఎత్తుకొని వాటిని అమ్మడానికి శివలింగ పట్టణం బయలుదేరుతాడు. భీముడు అలా నెత్తిన కట్టెలు పెట్టుకుని వెళుతుండగా విభూది గడ్డలతో నిర్మించుకున్న కోట గోడకు, కట్టెలు తగిలి అది కూలుతుంది. అందుకు భటులు కోపించి భీముడి పైకి యుద్ధానికి వస్తారు. భీముడు వాళ్లందరినీ ఓడిస్తాడు. ఈ విషయం తెలిసిన పోతురాజు ఆగ్రహించి తన చెరసాలలో భీముణ్ణి బంధిస్తాడు. పాండవులు భీముడు రాని కారణం ఏమిటని కృష్ణున్ని అడుగగా, భీముడు ఆపదలో చిక్కుకున్నాడని, మహాబలవంతుడైన పోతురాజు చేతిలో బందీగా ఉన్నాడని చెపుతాడు.

అందుకు పాండవులు మా కంటే బలవంతుడా అని ప్రశ్నించగా, అతని పూర్వ చరిత్ర చెప్పి పార్వతీ దేవి డమరుకం, కత్తి ఉన్నంత వరకు అతన్ని ఎవరూ జయించలేరని నిజం చెప్తాడు. అప్పుడు పాండవులు ఉపాయం ఆలోచించమని కృష్ణున్ని వేడుకోగా, అతను ఆలోచించి పోతురాజుకు మీ చెల్లెలు శంఖావతినిచ్చి పెండ్లి చేసి బావగా స్వీకరించండని సలహా ఇస్తాడు. పాండవులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి మాకు చెల్లెలు ఎక్కడిదని ప్రశ్నించగా అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. పాండురాజు మాద్రి ఒక రోజున నీటిలో రతికి ఉపక్రమిస్తుండగా శృంగి భృంగి శాపం వల్ల వల్ల పాండురాజు మరణించడం జరిగిందని, ఆ సమయంలో అతడి వీర్యం శంఖంలో పడి ఆ శంఖం నుండి శంఖిని జన్మించిందని వివరిస్తాడు. ఈ విషయం విన్న పాండవులు తమ చెల్లెలు శంఖిని పోతురాజు కిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరిస్తారు. ఆ రోజు రాత్రి శంఖిని అందుబాటులో లేకపోవడంతో శ్రీకృష్ణుడు అర్జునునికి స్త్రీ వేషం కట్టించి పోతరాజు ఆస్థానంలో నర్తింప చేయిస్తాడు.

పోతురాజు ఆనర్తకి పై మోహితుడై స్త్రీ వేషధారణలో ఉన్న అర్జునుని వివాహం చేసుకుంటానని కోరతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందుకు మేము అంగీకరించాలంటే నువ్వు మీ చెరసాలలో ఉన్న భీముణ్ణి వదిలివేయాలని, అంతేకాకుండా పాండవుల పక్షాన ఉండి మహాభారత యుద్ధంలో పాండవులకు విజయం కలిగేటట్లు చేయాలని, ప్రతి కార్యానికి నువ్వే ముందుండి నడిపించాలని కోరుతాడు. అందుకు ప్రతిఫలంగా కలియుగంలో భక్తులు నిన్నే ముందుగా కొలుస్తారని అభయమిస్తాడు. అప్పటి నుండి పాండవులు తలపెట్టిన ప్రతి కార్యానికి పోతురాజు ముందు ఉంటాడు. అందుకే ఇప్పటికీ రాయలసీమ ప్రాంతంలో జరిగే ద్రౌపది తిరుణాలలో పోతురాజుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాంతంలోని ద్రౌపది ధర్మరాజు ఆలయాల్లో తప్పకుండా పోతురాజు విగ్రహం ఉంటుంది. పోతురాజు ముందు ఉంటే, కార్యం సఫలీకృతమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మొదట భక్తులు పోతురాజును కొలుస్తారు.

నాయకుడు పోతురాజు
గిరిజన తెగల్లో ఒకటైన నాయకపోడు వారు కూడా లక్ష్మీదేవర, పెద్దమ్మ, కుర్రాజుల కొలుపు సందర్భంగా పోతురాజును పూజిస్తారు. ఇతన్ని లక్ష్మీదేవరకు తమ్ముడిగా చెప్పుకుంటారు. వీరు పూజించే పోతురాజు ప్రతిరూపం పొనికి కర్రతో చేయబడి, పెద్ద కళ్ళు, బుర్ర మీసాలు, నుదటన అడ్డబొట్టు, గడ్డంతో భీకరంగా కనిపిస్తాడు. అయితే ఇది తల వరకే ఉండి ముసుగు రూపంలో ఉంటుంది. నాయకపోడు వారు పోతురాజు గురించి ఒక కథను వినిపిస్తారు. పూర్వం శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో తుళు, కబ్బలి ,మొరస, చెంచు, కోయ, బోయ, నాయకపోడు వారు ఉండేవారని, ఇందులో నాయకపోడు తెగకు చెందిన పోతురాజు ఖండెం ఎత్తు (ఏడడుగుల పైన), దృఢమైన కండలు కలిగి మహా పరాక్రమం గల వీర సైనికుడు. రాయల సైన్యంలో పని చేసే ఇతని పేరు వింటేనే శత్రు సైన్యం పొలిమేరలో అడుగు పెట్టలేక పోయేదట.

అందుకే ఇతన్ని నేటికీ పొలి మేర కట్టు పోతురాజు అని పిలుస్తారు. శత్రువులు ఇతన్ని నేరుగా ఎదుర్కొనలేక నమ్మించి ఆహారంలో విషమిచ్చి చంపుతారు. ఆ తర్వాత అతని తల నరికి గుడ్డలో మూట కట్టి , మూడవ కంటికి తెలియకుండా నీటి మడుగులో పడేస్తారు. ఇప్పటికీ నాయకపోడు వారు ఈ సన్నివేశాన్ని దృష్టిలో ఉంచుకొని అతన్ని స్మరించుకుంటూ వారు జరుపుకునే లక్ష్మీదేవర, పెద్దమ్మ, కుర్రాజుల కొలుపుల సందర్భంలో అతనికి గుర్తుగా అడవి నుండి తెచ్చిన సండ్ర సరువుల్లో సరువు నుండి మొదలు భాగాన్ని వేరు చేసి పోతురాజు శిరస్సుగా భావించి కొలుస్తారు. పోతురాజు ప్రతిరూపంగా భావించే సండ్ర కర్రను అనుష్టాన ప్రక్రియలో భాగంగా గుడ్డలో మూట కట్టి ఒక బలమైన యువకుడి నెత్తికెత్తి డప్పు చప్పుళ్లతో తీసుకెళ్లి నీటి మడుగులో పడవేస్తారు. నాయకపోడు వారు పోతురాజును లక్ష్మీదేవర తమ్ముడిగా, వీరునిగా, బలమైన శక్తిగా పూజించటం కనిపిస్తుంది.

శక్తి దేవతల కథలు చెపుతూ ఆ దేవతలను తమ కళా పాండిత్యంతో శాంతపరుస్తూ భక్తులకు మానసిక శాంతిని, మనుగడకు కావలసిన ఆత్మస్థైర్యాన్ని కలిగించే పంబాల వారు కూడా ప్రత్యేకంగా పోతురాజు వేషం కడతారు. వీరు ఎల్లమ్మ కథ చెప్పిన తర్వాత ఒళ్లంతా పసుపు, నుదటన కుంకుమ బొట్టు, గజ్జెల లాగు , కాళ్ళకు గజ్జెలు కట్టుకొని మెడలో ఈరగోల ధరించి, పంబ వాయిస్తూ అమ్మవారి దండకం చదవగానే అతనికి అమ్మవారు ఆవహిస్తుంది. ఆ తర్వాత అతను మేకపోతును గావు పట్టి అమ్మ వారిని శాంత పరుస్తాడు. ఈ రకంగా శక్తి దేవతలను శాంతపరిచే అనుష్టాన ప్రక్రియలో పోతురాజుల పాత్ర క నిపిస్తుంది. వీరే కాకుండా మిగతా ఆశ్రిత కళాకారులు కూడా పోతురాజుల వేషం కట్టి అలరిస్తారు.

జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ సందర్భంగా శక్తికి ప్రతిరూపమైన పోతురాజు వేషాలు ఆకట్టుకుంటాయి. ఈ వేషాలు ధరించే కళాకారులు కొందరు వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆనవాయితీని అనుసరిస్తూ వేషం కడతారు. గుడిలోని రాగి పత్రాల మీద వీరి వంశ క్రమం వ్రాయబడి ఉంటుంది. వారే ఆ అమ్మవారి దగ్గర పోతురాజు వేషం వేయాల్సి ఉంటుంది. వీరికి ఆలయం ప్రతిఫలం అందిస్తుంది. అంతే కాకుండా మరికొందరు ఔత్సాహిక కళాకారులు కూడా పోతురాజు వేషం కడతారు. కళాకారులు ఎవరైనా పోతురాజు వేషం ధరించే సందర్భంలో నిష్టగా ఉంటారు. వీరికి అమ్మవారు ఆవహిస్తుంది. ఈ కళాకారులు అలంకరణలో పూర్వం పసుపు, కుంకుమ ప్రధానంగా ఉపయోగించి వేషం ధరించేవారు. ప్రస్తుతం ఆధునిక ఎనామిల్ రంగులు, రకరకాల పూసల దండలు, చమ్కీలు, గజ్జెల్లాగు ధరించి భక్తులను ఆకర్షించే విధంగా అలంకరించుకుంటున్నారు. చేతిలో పవిత్రమైన ఈరకోల లేదా కొరడా ప్రధానంగా ఉంటుంది.

పండుగలో భాగంగా ఊరేగింపులో పోతురాజులు డప్పు చప్పుళ్లకు అడుగులు వేస్తూ, భక్తులను అలరిస్తారు. వారి దగ్గర ఉండే పవిత్రమైన ఈరకోలను దుష్ట శక్తులు ఆవహించిన భక్తులు మెడలో వేయించుకొంటే ఆ శక్తులు పారిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతే కాకుండా దీర్ఘకాలిక రోగాలు ఉంటే తగ్గిపోతాయని నమ్ముతారు. ఆ రకంగా భక్తులు పోతురాజుల చేత ఈరకోలను మెడలో వేయించుకొని తమ మానసిక రుగ్మతలను తొలగించుకుంటారు. ముల్లోకాల్లోని నూటొక్క శక్తి దేవతల తమ్ముడైన పోతురాజు మన సంస్కృతిలో శక్తికి ప్రతిరూపంగా కనిపిస్తాడు. అందుకే భక్తులు ప్రతి గ్రామంలో పోతురాజు ను కొలుస్తారు. తమ మానసిక రుగ్మతలను తొలగించే దైవం గానే కాకుండా మానసిక ధైర్యాన్ని కలిగించే దైవంగా పూజిస్తారు.

bonalu celebrations in twin cities

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: