హెచ్‌ఐవి బాలుడికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ

  విచారణకు ఆదేశం తిరుచిరాపల్లి: పెరంబులూరు జిల్లాలో హెచ్‌ఐవి పాజిటివ్ బాలుడికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం నిరాకరించినట్లు ఆరోపణలు రావడంతో తమిళనాడు విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎస్ కన్నప్పన్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను ఆదేశించనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాలుడిని వారం క్రితం కొలక్కనాథం గ్రామంలోని పాఠశాలకు రావాలని పిలిచారని, అయితే బుధవారం తిరిగి ఇంటికి పంపినట్లు తెలిసింది. బాలుడికి ప్రవేశం ఎందుకు నిరాకరించారో, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు […] The post హెచ్‌ఐవి బాలుడికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

విచారణకు ఆదేశం

తిరుచిరాపల్లి: పెరంబులూరు జిల్లాలో హెచ్‌ఐవి పాజిటివ్ బాలుడికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం నిరాకరించినట్లు ఆరోపణలు రావడంతో తమిళనాడు విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎస్ కన్నప్పన్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌ను ఆదేశించనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బాలుడిని వారం క్రితం కొలక్కనాథం గ్రామంలోని పాఠశాలకు రావాలని పిలిచారని, అయితే బుధవారం తిరిగి ఇంటికి పంపినట్లు తెలిసింది. బాలుడికి ప్రవేశం ఎందుకు నిరాకరించారో, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు కె కామరాజ్ మధ్య జరిగిన సంభాషణ గురించి స్కూల్ ఎడ్యుషన్ డైరెక్టర్ తెలుసుకోవలనుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అకాడమిక్‌గా విద్యార్థి పనితీరు సరిగా లేకపోవడంతో ప్రధాన ఉపాధ్యాయుడు, బాలుడి బంధువుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా, బాలుడికి తాను ప్రవేశం నిరాకరించలేదని, ఆ అధికారం కూడా తనకు లేదని హెడ్మాష్టర్ తెలిపారు. విద్యార్థి తమను సంప్రదిస్తే ప్రవేశం కల్పిస్తామని చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అరుల్ రంగన్ తెలిపారు.

Children with HIV cannot be denied admission to school

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హెచ్‌ఐవి బాలుడికి స్కూల్లో ప్రవేశం నిరాకరణ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: