నేటి నుంచి ‘ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్’

  నేడు, రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రారంభించనున్న ఎంపి సంతోష్‌కుమార్ మన తెలంగాణ/ హైదరాబాద్‌: విదేశాల్లో ఎంబిబిఎస్ కళాశాలలు, సీట్లకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శనివారం ఉదయం 10.30 […] The post నేటి నుంచి ‘ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నేడు, రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు
ప్రారంభించనున్న ఎంపి సంతోష్‌కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్‌: విదేశాల్లో ఎంబిబిఎస్ కళాశాలలు, సీట్లకు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘టీ న్యూస్’ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించనున్నారు. అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019ను తొలిసారిగా టీ న్యూస్, సమస్తే తెలంగాణ, మన తెలంగాణ, గ్రేట్ తెలంగాణ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఖైరతాబాద్ సర్కిల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, విశ్వేశ్వరయ్య భవన్‌లో ఏర్పాటవుతున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ప్రతిష్టాత్మక విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులను డైరక్టుగా కలుసుకునే అవకాశంతో పాటు, ఫీజు, ఇతర సందేహాలను నివృత్తి చేసుకొవటానికి దోహదపడనుంది.

ఏ దేశాల్లో ఎంబిబిఎస్ చేయవచ్చు? ఆ దేశాల యూనివర్సిటీలో ఎంత ఫీజు ఉంది? ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఏ దేశాల్లో ఎంబిబిఎస్ చదవడానికి ఆసక్తి చూపించారు? ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలు, బోధనా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా అని ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా తెలుసుకోవచ్చు. విటితోపాటు ప్రతిష్టాత్మక విదేశీ విద్యా సంస్థల ప్రతినిధులను డైరక్టుగా కలుసుకునే అవకాశం కలుగుతుంది. భారతీయ వైద్య మండలి (ఎంసిఐ) నిబంధనలూ, సూచనల ప్రకారం ఏ యూనివర్సిటీల్లో చదివితే బాగుంటుంది అనే విషయాలను నిపుణులు ఇచ్చే సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఎంపిక చేసుకున్న కాలేజీకి ఆయా దేశాల ప్రభుత్వ గుర్తింపు ఉందా, విదేశాల్లో ఎంబిబిఎస్ చేసి తిరిగి భారతదేశంలో ప్రాక్టీస్ చేయవచ్చా అనే అంశాలతో పాటు ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

అబ్రాడ్ ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ, దవావో మెడికల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, కిర్గి స్టేట్ మెడికల్ అకాడమీ, ఆస్తాన మెడికల్ యూనివర్సిటీ, సెమిస్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అకాకి మెడికల్ యూనివర్సిటీ, జార్జియా నేషనల్ యూనివర్సిటీ, సెయింట్ పాల్ యూనివర్సిటీలతో పాటు మరెన్నో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లు పాల్గొంటున్నాయి. కన్సల్టెన్సీలను సంప్రదించిమోసపోకుండా విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీ న్యూస్ తీసుకొస్తున్న ఎడ్యుకేషన్ ఫెయిర్ ఓ వారధి కానుంది. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు, వాటి భవిష్యత్ ఎలా ఉంటుంది? అనే విషయాలను కూడా ఈ ఫెయిర్‌లో నిపుణుల ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

MBBS Education Fair start from today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేటి నుంచి ‘ఎంబిబిఎస్ ఎడ్యుకేషన్ ఫెయిర్’ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: