మంగళవారం వరకూ ఉన్నదున్నట్లుగానే

  కర్నాటక స్పీకర్‌కు సుప్రీం కట్టడి చర్యల నిరోధానికి ఆదేశాలు జటిల అంశాలపై పరిశీలన న్యూఢిల్లీ : పది మంది కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక రూలింగ్ వెలువరించింది. యధాతథ స్థితిని పాటించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ (మంగళవారం) వరకూ కర్నాటక స్పీకర్ చర్యలను నిరోధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. మంగళవారం వరకూ ఈ పది మంది ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం, వారిపై అనర్హతలపై ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని ధర్మాసనం […] The post మంగళవారం వరకూ ఉన్నదున్నట్లుగానే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కర్నాటక స్పీకర్‌కు సుప్రీం కట్టడి
చర్యల నిరోధానికి ఆదేశాలు
జటిల అంశాలపై పరిశీలన

న్యూఢిల్లీ : పది మంది కర్నాటక అసమ్మతి ఎమ్మెల్యేల విషయంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక రూలింగ్ వెలువరించింది. యధాతథ స్థితిని పాటించాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నెల 16వ తేదీ (మంగళవారం) వరకూ కర్నాటక స్పీకర్ చర్యలను నిరోధిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. మంగళవారం వరకూ ఈ పది మంది ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదం, వారిపై అనర్హతలపై ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల రాజీనామా వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పందించింది. చాలా జటిలమైన అంశాలు ముందుకు వచ్చాయి.

ఈ దశలో ఇప్పుడున్న పరిస్థితిని కొనసాగించాల్సిందేనని అభిప్రాయపడుతున్నట్లు న్యాయమూర్తులు దీపక్‌గుప్తా, అనిరుద్ధ బోస్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. తాము 16వ తేదీన తదుపరి పరిశీలన చేపడుతామని, ఈ దశలో స్పీకర్ చర్యలను నిరోధిస్తున్నామని తమ ఆదేశాలలో వెల్లడించారు. వ్యాజ్యాల విచారణ దశలో ప్రస్తావనకు వచ్చిన కీలక, విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు, వీటిని న్యాయస్థానం తగు విధంగా బేరీజువేసుకుని నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది.రెబెల్ ఎబ్మెల్యేల పిటిషన్‌ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 పరిధిలో విచారణకు స్పీకరించడాన్ని స్పీకర్, కర్నాటక సిఎం సవాలు చేశారని, దీనిని తాము పరిగణనలోకి తీసుకుని స్పందించాల్సి ఉందని ధర్మాసనం తమ ఆదేశాలలో పేర్కొంది. పది మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముఖుల్ రొహత్గీ వాదించారు.

సభ్యుల రాజీనామాల అంశం తొలి ప్రాధాన్యతా అంశం అని, తరువాతనే వారిపై అనర్హత వేటు విషయం ప్రస్తావనకు వస్తుందని, స్పీకర్ ఏకపక్ష నిర్ణయాలకు దిగే అవకాశం ఉందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ విధంగా పలు అంశాలు ధర్మాసనం ముందుకు రావడం, సరైన నిర్థారణలు లేకపోవడంతో , మరింత విచారణకు అవసరం ఏర్పడిందని, అప్పటి వరకూ స్పీకర్ చర్యలకు దిగినా అది చట్టపరమైన ప్రక్రియకు ప్రతిబంధకం అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. రాజీనామాలపై స్పీకర్ స్పందించాల్సిన బాధ్యత ఉందని, అంతగా కావాలనుకుంటే రెండు రోజుల సమయం ఇచ్చి చూడాలని , లేకపోతే స్పీకర్‌పై కోర్టు ధిక్కార నోటీసు వెలువరించాల్సి ఉంటుందని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది సూచించారు. అన్ని అంశాలపై తమ స్పందన మంగళవారం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

కర్నాటకపై మరో పిటిషన్
కర్నాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఫిరాయింపులుగా పరిగణిస్తూ తగు విధంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఒక పిటిషన్ దాఖలు అయింది. కర్నాటక యువజన కాంగ్రెస్ నేత అనిల్ ఛాకో జోసెఫ్ శుక్రవారం ఈ పిటిషన్ వేశారు. 400 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తల తరఫున తాను ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు రాజీనామాలకు దిగడం ఫిరాయింపులలో భాగం పైగా రాజీనామాలకు స్పీకర్‌పై ఒత్తిడి తేవడం అప్రజాస్వామికం, దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దండిగా డబ్బులు చెల్లింపుల ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరుగుతున్నాయని, వారితో రాజీనామాల చర్యకు దిగుతున్నారని దీనిని న్యాయస్థానం గుర్తించాలని పిటిషనరు తెలిపారు.

Rebel MLAs move SC against Speaker decision

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మంగళవారం వరకూ ఉన్నదున్నట్లుగానే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: