ఎంపిటిసిని హతమార్చిన మావోయిస్టులు…

  చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ -చత్తీస్‌గఢ్ సరిహద్దులోని చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ మాజీ ఎంపిటిసి నల్లూరి శ్రీనివాసరావు (47)ను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చర్ల శబరి ఏరియా కమిటీ శుక్రవారం ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చింది. గత సోమవారం రాత్రి సుమారు 30 మంది సాయుధులైన మావోయిస్టులు శ్రీనివాసరావును తన నివాసంలో నిద్రిస్తుండగా భార్యను, కుమారున్ని కొట్టి తన మోటర్ సైకిల్‌తో సహా అతనిని కిడ్నాప్ […] The post ఎంపిటిసిని హతమార్చిన మావోయిస్టులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చర్ల : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ -చత్తీస్‌గఢ్ సరిహద్దులోని చర్ల మండలం పెద్దమిడిసిలేరు పంచాయతీ బెస్తకొత్తూరు గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ మాజీ ఎంపిటిసి నల్లూరి శ్రీనివాసరావు (47)ను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) చర్ల శబరి ఏరియా కమిటీ శుక్రవారం ఇన్‌ఫార్మర్ నెపంతో హతమార్చింది. గత సోమవారం రాత్రి సుమారు 30 మంది సాయుధులైన మావోయిస్టులు శ్రీనివాసరావును తన నివాసంలో నిద్రిస్తుండగా భార్యను, కుమారున్ని కొట్టి తన మోటర్ సైకిల్‌తో సహా అతనిని కిడ్నాప్ చేసిన విషయం పాఠకులకు తెలిసింది.

కాగా శుక్రవారం మధ్యాహ్న సమయంలో తెలంగాణ -చత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దు ఎర్రంపాడు గ్రామ సమీపంలో హతమార్చారు. గ్రామ సమీపంలో అత్యంత కిరాతకంగా నరికి హతమార్చారు. మృతదేహం పక్కనే మోటార్ సైకిల్‌ను విడిచిపెట్టి వెళ్లారు. అతనిని హతమార్చిన సమీపంలో శబరి ఏరియా కార్యదర్శి శారద పేరుతో మావోయిస్టులు లేఖను వదిలివెళ్లారు. లేఖలో నల్లూరి శ్రీనివాసరావు పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారటం వల్లనే శ్రీనివాస్ హతమార్చామని ఇంటిలిజెన్స్ పోలీసులతో కలిసి మావోయిస్టు పార్టీని నిర్మూలించడానికి ఆదివాసీ గ్రామాలలో ఇన్‌ఫార్మర్లను తయారుచేస్తూ దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దానిని పోలీసులకు చేరవేయటం, ప్రజా సంఘాలను ఆరెస్టులు చేయించటం వంటివి చేస్తున్నాడని లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఆదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూమిని పోలీసుల అండదండలతో అక్రమంగా గుంజుకున్నాడు. ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయిస్తూ ఎస్‌ఐబీ వారితో కలిసి ఆదివాసీ ప్రజా సంఘాల పేరుతో సిపిఐ మావోయిస్టు పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాడని, ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీకి అడ్డుగా నిలుస్తుండటంతో నల్లూరి శ్రీనివాసరావును ఖతం చేస్తున్నామంటూ లేఖలో పేర్కొన్నారు.

ఉలిక్కిపడ్డ మన్యం
గత కొంతకాలంగా స్తబ్ధతగా ఉన్న చర్ల ఏజెన్సీ ప్రాంతం నల్లూరి శ్రీనివాసరావు హత్యతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. గతంలో కిడ్నాప్ కాబడిన కొందరిని మావోయిస్టులు సురక్షితంగా వదిలిపెట్టిన సంఘటనలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ ఎంపిటిసి శ్రీనివాసరావును కూడా విడుదల చేసినట్లు బుధవారం పుకార్లు వచ్చాయి. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం మావోయిస్టులు శ్రీనివాసరావును అత్యంత కిరాతకంగా నరికి చంపారు.

Maoists killed the MPTC

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎంపిటిసిని హతమార్చిన మావోయిస్టులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: