సిఎస్ ఇంట్లో త్రాచుపాము…

  చాకచక్యంగా పట్టుకున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఇంట్లోకి పాము వచ్చింది. ఇది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది ఆ త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్‌లోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. అందులో ఎస్.కె. జోషితో పాటు పలువురు అధికారులు నివాసం ఉంటున్నారు. ఆ ప్రాంతంలో గుట్టలు, […] The post సిఎస్ ఇంట్లో త్రాచుపాము… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చాకచక్యంగా పట్టుకున్న హోంశాఖ ప్రిన్సిపల్ సెకట్రరీ

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఇంట్లోకి పాము వచ్చింది. ఇది చూసిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది ఆ త్రాచుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, ప్రశాసన్ నగర్‌లోని ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ ఉన్నాయి. అందులో ఎస్.కె. జోషితో పాటు పలువురు అధికారులు నివాసం ఉంటున్నారు.

ఆ ప్రాంతంలో గుట్టలు, చెట్లు, చిన్న చిన్న నీటి కుంటలు అధికంగా ఉండటంతో తరుచూ విష సర్పాలు వస్తున్నాయి. ఈ క్రమంలో జోషి నివాసం వెనుక ఉన్న స్థలంలోకి ఓ పాము వచ్చి చేరింది. బుసకొడుతున్న పామును చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది అక్కడకు వచ్చి పామును బంధించి, ప్లాస్టిక్ డబ్బాలోకి పంపించారు. దానికి ఎటువంటి హానీ తలపెట్టకుండా, దూరంగా వదిలి పెడతానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Snake got into Chief Secretary’s Home

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిఎస్ ఇంట్లో త్రాచుపాము… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: