8 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం

  జూన్‌లో 3.18 శాతం నమోదు న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు పెరగడంతో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరుకుంది. అయితే ఆర్‌బిఐ లక్ష్యానికి కంటే దిగువనే ఉండడంతో మరోసారి వడ్డీ రేటు తగ్గింపునకు అవకాశముంది. జూన్‌లో వార్షిక రిటైల్ లేదా వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.18 శాతం నమోదవగా, గతేడాది ఇదే సమయంలో 3.05 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 2.99 శాతంగా ఉంది. అయితే విశ్లేషకుల […] The post 8 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జూన్‌లో 3.18 శాతం నమోదు

న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు పెరగడంతో దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరుకుంది. అయితే ఆర్‌బిఐ లక్ష్యానికి కంటే దిగువనే ఉండడంతో మరోసారి వడ్డీ రేటు తగ్గింపునకు అవకాశముంది. జూన్‌లో వార్షిక రిటైల్ లేదా వినిమయ ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.18 శాతం నమోదవగా, గతేడాది ఇదే సమయంలో 3.05 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 2.99 శాతంగా ఉంది. అయితే విశ్లేషకుల అంచనాల కంటే దిగువనే ద్రవ్యోల్బణం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 1.83 శాతం నుంచి 2.17 శాతానికి పెరిగింది.

మేలో ఐఐపి 3.1 శాతం
గనులు, తయారీ రంగాల్లో ఉత్పత్తి మందగించడం వల్ల మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపి) 3.1 శాతానికి తగ్గింది. గతేడాది ఇదే సమయంలో ఐఐపి 3.8 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇది 4.3 శాతంలో ఉంది. కన్జూమర్ డ్యూరబుల్, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ రేటు వరుసగా మైనస్ 0.1 శాతం, 7.7 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మే నెలలో తయారీరంగం సానుకూల వృద్ధిని చూపింది.

Retail inflation inches up to 3.18 percent in June

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 8 నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: