తీవ్ర ఒడిదుడుకులు.. ఆఖరికి నష్టాలు

ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ పడిన మరుసటి రోజు మళ్లీ మార్కెట్లు డీలా పడ్డాయి. వారాంతం శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టంతో 38,736 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 11,552 వద్ద స్థిరపడింది. ఉదయం సూచీలు ఉత్సాహంగానే […] The post తీవ్ర ఒడిదుడుకులు.. ఆఖరికి నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: వరుస నష్టాలకు బ్రేక్ పడిన మరుసటి రోజు మళ్లీ మార్కెట్లు డీలా పడ్డాయి. వారాంతం శుక్రవారం దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 87 పాయింట్ల నష్టంతో 38,736 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 11,552 వద్ద స్థిరపడింది. ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమై 100 పాయింట్లకు పైగా లాభంతో సాగాయి.

అయితే కాసేపటికే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కొన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో కోలుకున్న మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఒక దశలో సెన్సెక్స్ 120 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అవగా నిఫ్టీ 11,600 మార్క్ పైన కదలాడింది. అయితే చివరి సమయంలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌ఇలో ప్రధానంగా వేదాంత, సన్‌ఫార్మా, టాటాస్టీల్, ఏసియన్ పెయింట్స్, యస్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. మరోవైపు విప్రో, ఒఎన్‌జిసి, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టి షేర్లు నష్టపోయాయి.

Sensex slips 87 points in choppy trade

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తీవ్ర ఒడిదుడుకులు.. ఆఖరికి నష్టాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: