అంచనాలను అందుకుంది..

  క్యూ1లో ఇన్ఫోసిస్ లాభం రూ.3,798 కోట్లు గతేడాదితో పోలిస్తే 5.2 శాతం పెరిగింది న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్ ముగింపు నాటి తొలి త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నాయి. బెంగళూరు ఆధారిత ఇన్ఫోసిస్ సంస్థ క్యూ1(ఏప్రిల్‌జూన్)లో రూ.3,798 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో రూ.3,612 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 5.2 శాతం పెరిగింది. కంపెనీ రెవెన్యూ రూ. 21,803 […] The post అంచనాలను అందుకుంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

క్యూ1లో ఇన్ఫోసిస్ లాభం రూ.3,798 కోట్లు
గతేడాదితో పోలిస్తే 5.2 శాతం పెరిగింది

న్యూఢిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ జూన్ ముగింపు నాటి తొలి త్రైమాసిక ఫలితాల్లో రాణించింది. కంపెనీ ఫలితాలు విశ్లేషకుల అంచనాలను అందుకున్నాయి. బెంగళూరు ఆధారిత ఇన్ఫోసిస్ సంస్థ క్యూ1(ఏప్రిల్‌జూన్)లో రూ.3,798 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో రూ.3,612 కోట్లతో పోలిస్తే ఈసారి లాభం 5.2 శాతం పెరిగింది. కంపెనీ రెవెన్యూ రూ. 21,803 కోట్లతో 13.9 శాతం వృద్ధి సాధించింది. గతేడాదిలో రెవెన్యూ రూ.19,128 కోట్లుగానే ఉంది. ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వృద్ధి అంచనాలను 7.5 -9.5 శాతం నుంచి 8.5- 10.5 శాతానికి పెంచింది. కంపెనీ ఎబిటా 4431 కోట్ల రూపాయలుగా, ఎబిటా మార్జిన్ 20.5 శాతంగా నమోదు చేసింది.

ఎబిటా మార్జిన్ గైడెన్స్‌ను 21- 23 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మార్కెట్ వర్గాలు ఇన్ఫోసిస్ ఎబిటా అంచనా రూ. 4420 కోట్లు, ఎబిటా మార్జిన్ అంచనా 20.3 శాతం, రూ.21,817 కోట్ల రెవెన్యూ అంచనా, రూ.3730 కోట్ల లాభం అంచనాగా లెక్కించారు. ఈ అంచనాలకు అనుగుణంగానే ఫలితాలున్నాయి. క్యూ1లో కంపెనీ 270 కోట్ల డాలర్ల డీల్స్‌ను దక్కించుకుంది. డిజిటల్ విభాగంలో అంచనాలకు అనుగుణంగా వృద్ది నమోదు చేసింది. కొత్తగా 112 క్లయింట్లను సంపాదించింది. మార్కెట్ సమయం ముగిసిన తర్వాత ఈ ఫలితాలను ప్రకటించారు. అయితే బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో ఇన్ఫోసిస్ షేరు విలువ 1 శాతం పెరిగి రూ.730 వద్ద ముగిసింది.

Infosys reports Rs 3,798 crore profit in Q1

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అంచనాలను అందుకుంది.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: