దేశంలోనే తొలి ఇథనాల్ బైక్

  టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 ధర రూ.1,20,000 ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ దేశంలో తొలిసారిగా ఇథనాల్‌తో నడిచే బైక్‌ను లాంచ్ చేసింది. టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 ఎఫ్‌ఐ ఇ100 పేరిట విడుదల చేసిన ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,20,000గా కంపెనీ నిర్ణయించింది. ఇథనాల్‌తో నడిచే మొట్టమొదటి మోటార్‌సైకిల్ దేశంలో ఇదే. ఈ స్పెషల్ ఎడిషన్ మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం […] The post దేశంలోనే తొలి ఇథనాల్ బైక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200
ధర రూ.1,20,000

ముంబై: ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్ దేశంలో తొలిసారిగా ఇథనాల్‌తో నడిచే బైక్‌ను లాంచ్ చేసింది. టివిఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 ఎఫ్‌ఐ ఇ100 పేరిట విడుదల చేసిన ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,20,000గా కంపెనీ నిర్ణయించింది. ఇథనాల్‌తో నడిచే మొట్టమొదటి మోటార్‌సైకిల్ దేశంలో ఇదే. ఈ స్పెషల్ ఎడిషన్ మొదటగా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ప్రభుత్వం కూడా ఇంధన ఆదా, కాలుష్యరహితమైన ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.

2023 నాటికి 150 సిసి కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న త్రీవీలర్స్, ద్విచక్ర వాహనాలను విద్యుదీకరణ చేయాలని కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో ఇలాంటి ఒక నూతన ప్రయత్నాన్ని ప్రారంభించినట్లు టివిఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ తెలిపారు. ద్విచక్ర వాహనాల స్థిరమైన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని, దీనిలో భాగంగానే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నామని అన్నారు. ఇలాంటి తరుణంలో టివిఎస్ వినియోగదారులకు ఇథనాల్ శక్తితో నడిచే మోటార్‌సైకిల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సంస్థ భావించింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఇథనాల్ మోటార్‌సైకిల్స్ పనితీరులో ఎలాంటి వ్యత్యాసాలు ఉండవని, అవి పర్యావరణానికి అనుకూలమని అన్నారు.

TVS Apache RTR 200 ethanol launch in india

Related Images:

[See image gallery at manatelangana.news]

The post దేశంలోనే తొలి ఇథనాల్ బైక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: