ఎస్‌బిఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్

  ఆగస్టు 1 నుంచి ఐఎంపిఎస్, నెఫ్ట్ చార్జీలు ఉండవ్ ముంబై: ఎస్‌బిఐ (స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు శుభవార్త. ఐఎంపిఎస్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. నగదు రహిత ఎకానమీ దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలనే లక్షంతో ఆన్‌లైన్ లావాదేవీలకు చార్జీలను రద్దు చేస్తున్నట్టు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) […] The post ఎస్‌బిఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆగస్టు 1 నుంచి ఐఎంపిఎస్, నెఫ్ట్ చార్జీలు ఉండవ్

ముంబై: ఎస్‌బిఐ (స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు శుభవార్త. ఐఎంపిఎస్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బిఐ ఓ ప్రకటనలో తెలిపింది. నగదు రహిత ఎకానమీ దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలనే లక్షంతో ఆన్‌లైన్ లావాదేవీలకు చార్జీలను రద్దు చేస్తున్నట్టు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పేర్కొంది. ఈమేరకు దేశంలో 25 శాతం మార్కెట్ వాటా కల్గిన ఎస్‌బిఐ కూడా ఇకపై మొబైల్ ఫోన్ ద్వారా ఐఎంపిఎస్‌ను వినియోగించిన జరిపే నగదు బదిలీలకు చార్జీలకు వసూలు చేయొద్దని నిర్ణయించింది. రోజులో ఏ సమయంలోనైనా డబ్బులు పంపేందుకు ఐఎంపిఎస్ ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు లావాదేవీలపై ఎస్‌బిఐ ఎలాంటి చార్జీలూ వసూలు చేయడం లేదు. రూ.1000- నుంచి 10,000 వరకు 1+జిఎస్‌టి, రూ.10,00 1- నుంచి 1,00,000 వరకు రూ.2+జిఎస్‌టి, రూ.1,00,001 నుంచి -2,00,000 వరకు లావాదేవీలపై రూ.3+జిఎస్‌టి వసూలు చేస్తోంది. ఇకపై ఈ చార్జీలను ఎస్‌బిఐ వసూలు చేయదు. గత నెల ఎన్‌ఇఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు 1 నుంచి ఎస్‌బిఐ వాటిపై చార్జీలను ఎత్తివేసింది. 2019 మార్చి ముగింపు నాటికి ఆరు కోట్లకు పైగా ఎస్‌బిఐ కస్టమర్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను వినియోగించగా, మొబైల్ బ్యాంకింగ్ సేవలను 1.41 కోట్ల మంది వినియోగించారు. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఎస్‌బిఐ 18 శాతం మార్కెట్ వాటాను కల్గివుంది. యోనో యాప్‌ను ఒక కోటిమంది రిజిస్టర్ చేసుకున్నారు. డిజిటల్ లావాదేవీల వైపు మరింత మంది కస్టమర్లను ఆకర్షించేందుకు నెఫ్ట్, ఐఎంపిఎస్, ఆర్‌టిజిఎస్ చార్జీలను ఎత్తివేసినట్టు బ్యాంక్ వెల్లడించింది.

SBI to make IMPS transactions free from Aug 1

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎస్‌బిఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: