20వ సినిమాకు కూడా అలాగే చేయాలంటున్నారు…

  టాలీవుడ్‌లో తమ అభిమాన హీరో సినిమా అప్‌డేట్ కోసం డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఎదురు చూసినంతగా మరే ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూసి ఉండరని చెప్పాలి. ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు ఆ తర్వాత ‘సాహో’ కోసం మరో రెండేళ్లు కళ్లు కాయలు కాచేలా వీరు ఎదురు చూశారు.ఇదిలా ఉండగా ‘సాహో’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ వారు కూడా ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులు […] The post 20వ సినిమాకు కూడా అలాగే చేయాలంటున్నారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాలీవుడ్‌లో తమ అభిమాన హీరో సినిమా అప్‌డేట్ కోసం డార్లింగ్ హీరో ప్రభాస్ అభిమానులు ఎదురు చూసినంతగా మరే ఇతర హీరోల అభిమానులు కూడా ఎదురు చూసి ఉండరని చెప్పాలి. ‘బాహుబలి’ కోసం ఐదేళ్లు ఆ తర్వాత ‘సాహో’ కోసం మరో రెండేళ్లు కళ్లు కాయలు కాచేలా వీరు ఎదురు చూశారు.ఇదిలా ఉండగా ‘సాహో’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ వారు కూడా ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానులు మాత్రం ‘సాహో’కు ఏ విధంగా చేశారో ఆ తర్వాత ప్రభాస్ నటించబోయే 20వ సినిమాకు కూడా అలాగే చేయాలని యువి క్రియేషన్స్ వారిని ఇప్పటి నుంచే కోరుతున్నారు.

ఇంతకీ వీరు ఇంతలా అడుగుతున్న కోరిక ఏమిటంటే… గతంలో ‘బాహుబలి 2’ విడుదల చేసినపుడు ‘సాహో’ మొట్టమొదటి టీజర్‌ను అన్ని భాషల్లో కట్ చేసి జత చేసి విడుదల చేశారు. అది చూశాక ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. కానీ మళ్లీ అప్పటి నుంచి అఫిషియల్ అప్‌డేట్ తెలుసుకోవడానికి ప్రభాస్ పుట్టిన రోజు వరకు ఆగాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు విడుదల కాబోతున్న ‘సాహో’ చిత్రానికి కూడా అతను నటించనున్న 20వ సినిమాకు సంబంధించి ఏదో ఒక చిన్న టీజర్ అతికించి విడుదల చేయమని సోషల్ మీడియాలో అభిమానులు అడుగుతున్నారు. ప్రభాస్ 20వ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 1940వ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కనుందని తెలిసింది.

Fans Awaiting Prabhas Movie

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 20వ సినిమాకు కూడా అలాగే చేయాలంటున్నారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: