ఎయిర్ ఇండియాలో ఉద్యోగం.. రూ.99,500 వసూలు

  హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి నగరానికి శుక్రవారం తీసుకువచ్చారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్, 10 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ సిపియూ, రౌటర్, ఎనిమిది డెబిట్ కార్డులు, బ్యాంక్ వ్యాలెట్లు, పాస్‌బుక్స్, చెక్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బీహార్‌కు చెందిన అమన్ గౌతమ్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఉంటున్నాడు, కునాల్ కుమార్ ఢిల్లీ, మదర్ డైరీ సమీపంలోని […] The post ఎయిర్ ఇండియాలో ఉద్యోగం.. రూ.99,500 వసూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఇద్దరు మోసగాళ్లను నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి నగరానికి శుక్రవారం తీసుకువచ్చారు. నిందితుల వద్ద నుంచి ల్యాప్‌టాప్, 10 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ సిపియూ, రౌటర్, ఎనిమిది డెబిట్ కార్డులు, బ్యాంక్ వ్యాలెట్లు, పాస్‌బుక్స్, చెక్‌బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బీహార్‌కు చెందిన అమన్ గౌతమ్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌లో ఉంటున్నాడు, కునాల్ కుమార్ ఢిల్లీ, మదర్ డైరీ సమీపంలోని లక్ష్మినగర్‌లో ఉంటున్నాడు. నగరానికి చెందిన ఓ బాధితుడికి ఫోన్, ఈమేయిల్ ద్వారా ఓ వ్యక్తి కాంటాక్ట్‌లోకి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయని తెలిపాడు. అయితే ప్రాసెస్ ఫీజు తదితర ఖర్చుల కోసం డబ్బులు పంపించమని కోరగా బాధితుడు గూగుల్ పే ద్వారా రూ.99,500 పంపించాడు. డబ్బులు అందగానే నిందితుడు మొబైల్ ఫోన్‌ను స్విచ్‌ఆఫ్ చేశాడు. దీంతో బాధితుడు తను మోసపోయానని గ్రహించి నగర సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించి వారిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చారు. అడిషనల్ డిసిపి రఘువీర్ పర్యవేక్షణలో ఎస్సై భద్రంరాజు రమేస్, పిసిలు వెంకటేశం, మహేశ్వర్ రెడ్డి నిందితులను పట్టుకున్నారు.

వెబ్‌సైట్ల నుంచి సమాచారం సేకరణ…
నిందితుడు అమన్ గౌతమ్, కునాల్ కుమార్ వెబ్‌సైట్ల నుంచి నిరుద్యోగుల సమాచారం తీసుకుని వారికి ఫోన్ చేయడం లేదా మేయిల్ చేస్తున్నారు. తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని రిజిస్ట్రేషన్ ఖర్చులు, సెక్యూరిటీ డిపాజిట్, డాక్యుమెంట్ వేరిఫికేషన్‌కు డబ్బులు పంపించమని చెబుతున్నారు. డబ్బులు పంపించిన తర్వాత మొబైల్ ఆఫ్ చేస్తున్నారు. ఈ విధంగా చాలామంది నిరుద్యోగులకు మోసం చేసినట్లు తెలిసింది.

Two arrested for fraud With name Airline India jobs

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎయిర్ ఇండియాలో ఉద్యోగం.. రూ.99,500 వసూలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: