పిజి జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వ్యాల్యుయేషన్‌

  ఔటా అధ్యక్షులు ప్రొ.బట్టు సత్యనారాయణ హైదరాబాద్: ఓ.యూ పిజి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వాల్యుయేషన్‌ను కొనసాగించాలని లేకపోతే తాము జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో పాల్గొనబోమని ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ తెలిపారు. ఓ.యూలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓ.యూ పిజి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వాల్యుయేషన్‌ను రద్దు చేస్తూ.. కేవలం సింగిల్ వ్యాల్యుయేషన్ సరిపోతుందని ఓ.యూ స్టాండింగ్ కమిటీలో తీర్మాణం చేసి ఒక ఆర్డర్ కాపీని […] The post పిజి జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వ్యాల్యుయేషన్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఔటా అధ్యక్షులు ప్రొ.బట్టు సత్యనారాయణ

హైదరాబాద్: ఓ.యూ పిజి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వాల్యుయేషన్‌ను కొనసాగించాలని లేకపోతే తాము జవాబు పత్రాల వాల్యుయేషన్‌లో పాల్గొనబోమని ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ తెలిపారు. ఓ.యూలో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓ.యూ పిజి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వాల్యుయేషన్‌ను రద్దు చేస్తూ.. కేవలం సింగిల్ వ్యాల్యుయేషన్ సరిపోతుందని ఓ.యూ స్టాండింగ్ కమిటీలో తీర్మాణం చేసి ఒక ఆర్డర్ కాపీని ఈనెల 2న ఓ.యూ అధికారులు తీసుకువచ్చారని చెప్పారు. అయితే స్టాండింగ్ కమిటీ ఆర్డర్ చెల్లదన్నారు. రాష్ట్ర యూనివర్సిటీ యాక్టు ప్రకారం స్టాచ్‌స్, ఆర్డినెన్స్ ఉంటాయని, వీటికి రాష్ట్ర గవర్నర్ ఆమోదం కూడా ఉంటుందని ప్రొ. బట్టు వివరించారు.

ఆర్డినెన్స్‌లో భాగంగానే పిజి జవాబు పత్రాల మూల్యాంకనం డబుల్ వాల్యూయేషన్ ఉందని, ఇది గత ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు. డబుల్ వాల్యూయేషన్ తర్వాత ఇరువురు వేసిన మార్కుల్లో 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ తేడా వస్తే మూడో వ్యక్తికి థర్డ్ వాల్యూయేషన్ కూడా పోయే అవకాశం ఉందన్నారు. సింగిల్ వాల్యూయేషన్ వల్ల విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. అలాగే అధ్యాపకులపై విద్యార్థుల దాడులు జరిగే ప్రమాదం ఉందని వివరించారు. ఆన్‌లైన్ వ్యాల్యూయేషన్ వల్ల వ్యయం పెరగడమే కాకుండా సమయం వృధా అవుతుందన్నారు. ఇప్పటికైనా ఆన్‌లైన్ పేపర్ వాల్యూయేషన్‌ను రద్దు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. విలేకరుల సమావేశంలో ఔటా నాయకులు ప్రొఫెసర్ ఎ.కృష్ణయ్య, ప్రొఫెసర్ సురేందర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Double Valuation in PG Exam Answer Sheet Checking

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పిజి జవాబు పత్రాల మూల్యాంకనంలో డబుల్ వ్యాల్యుయేషన్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: